Pakistan PM Shehbaz Sharif : పాక్ ముస్లింలీగ్ - నవాజ్ (పీఎంఎల్ - ఎన్) పార్టీ అగ్రనేత షెహబాజ్ షరీఫ్ (72) రెండోసారి పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. సోమవారం రాష్ట్రపతి భవనంలో 33వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 336 సభ్యుల ఉన్న జాతీయ అసెంబ్లీలో ఆదివారం ప్రధానమంత్రి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. అందులో పీఎంఎల్-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన షెహబాజ్ 201 ఓట్లు సాధించారు. షెహబాజ్‌కు పోటీగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు చెందిన పార్టీ నుంచి ఒమర్ అయూబ్‌ఖాన్‌కు 92 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఓటింగ్ సమయంలో గందరగోళం
ఓటింగ్ సందర్భంగా పార్లమెంటులో పాకిస్థాన్ తెహ్రీక్- ఎ- ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుగల చట్టసభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొంది. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళన మధ్యే ఓటింగ్ నిర్వహించి విజయం సాధించిన షెహబాజ్‌ను ప్రధానిగా స్పీకర్ ప్రకటించారు. షరీఫ్ మొదటిసారి 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు.
'పెద్ద సవాలే ఉంది'
ఈ క్రమంలో తనను ప్రధానిగా చేసినందుకు అందరికి షెహబాజ్ కృతజ్ఞలు తెలిపారు. ' నాపై విశ్వాసం ఉంచి నున్ను ప్రధానిగా ఎన్నుకున్నందుకు అందరికీ నా ధన్యవాదములు. పాకిస్థాన్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ పార్లమెంటులో ఉన్నారు. వీరిలో జర్నలిస్టుల, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఇప్పుడు మన ముందు పెద్ద సవాలే ఉంది. ఈ పని కష్టమే కానీ, పాకిస్థాన్ విధిని మార్చాలి అని అందరం కలిసి అనుకుంటే అది సాధ్యం అవుతుంది. ' అని షెహబాజ్ అన్నారు.
ఉమ్మడి అభ్యర్థిగా షెహబాజ్
ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో 265 స్థానాలకుగాను పాకిస్థాన్ తెహ్రీక్- ఎ- ఇన్సాఫ్ (పీటీఐ) 93 చోట్ల విజయం సాధించింది. పీఎంఎల్- ఎన్ 72, పీపీపీ-52, ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ 15, ఇతర పార్టీలు 8 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవటం వల్ల పీఎంఎల్ -ఎన్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పీపీపీ కలిసి కూటమిగా ఏర్పాడ్డాయి. సుదీర్ఘ చర్చలు అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించి, ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌కు ప్రకటించాయి. తాజా ఓటింగ్‌లో మెజారిటీని సాధించి రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.
కుమార్తె కోసం ప్రధాని పదవి త్యాగం!- సైన్యానికి తలొగ్గిన నవాజ్ షరీఫ్
'బైడెన్ వద్దు- ఒబామా భార్య అయితే ఓకే'- డెమొక్రాట్ల అభ్యర్థిగా మిషెల్‌కు జై!