Hindu Temple Abu Dhabi Opening : 108 అడుగులు ఎత్తు- 262 అడుగుల పొడవు- 402 స్తంభాలపై అబ్బురపరిచే హిందూ దేవతామూర్తుల ప్రతిమలు- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం విశేషాలు ఇవి. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామినారాయణ్ సంస్థ దీన్ని నిర్మించింది. 180 అడుగుల వెడల్పుతో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. మందిర రూపకల్పనలో 25 వేల టన్నుల రాళ్లు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మీకోసం.
- అబుదాబిలో బాప్స్ నిర్మించిన హిందూ ఆలయం పశ్చిమాసియాలోనే అతి పెద్దది.
- 108 అడుగులు ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు.
- అత్యంత క్లిష్టమైన రీతిలో ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు పలు దేవుళ్ల కథలు వర్ణన.
- ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఉద్యానవనాలు, ఫుడ్ కోర్టులు, లైబ్రరీ ఏర్పాటు.
- మందిర్ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు.
- భూకంపం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు వంటి వాతావరణ మార్పులపై డేటాను సేకరించనున్న సెన్సార్లు.
- 402 స్తంభాలపై హిందూ దేవతామూర్తుల ప్రతిమలు.
- ఒక్క స్తంభంపై నెమళి, ఏనుగు వంటి వన్యప్రాణుల చిత్రాలు.
- ఆలయ నిర్మాణం కోసం భారత్‌లోని రాజస్థాన్ నుంచి పింక్ స్టోన్స్
- మందిర రూపకల్పనలో 25 వేల టన్నుల రాళ్ల వాడకం.
- ఇటలీ నుంచి పాలరాయిని తెప్పించిన బాప్స్ నిర్వాహకులు.
- ఇటలీ పాలరాళ్లను రాజస్థాన్‌లోని గ్రామాలకు పంపిన నిర్వాహకులు.
- నాలుగేళ్లపాటు ప్రతి భాగాన్ని చేతితో చెక్కిన 5 వేల మంది కళాకారులు.
- రాళ్లను చెక్కేందుకు సుత్తి, ఉలిని మాత్రమే వాడిన కళాకారులు.
- విడిభాగాలను రెండేళ్లుగా ఒకే చోట చేర్చిన ఎమిరేట్స్ కళాకారులు.
- జిక్సా పజిల్లో మాదిరిగా ఎలాంటి ఇనుము వాడకుండా ఆలయ రూపకల్పన.
- హిందూ శాస్త్రాలకు అనుగుణంగా పూర్తి సహజంగా నిర్మితమైన మందిరం.
- వెయ్యేళ్లకు పైగా ఆలయం చెక్కుచెదరకుండా ఉంటుందన్న నిర్వాహకులు.
- మందిరానికి కావాల్సిన భూమిని ఇచ్చిన యూఏఈ అధ్యక్షుడు.
- ఏడు ఎమిరేట్స్‌ను సూచించేలా ఆలయ ఏడు గోపురాలు.
- ఆలయం ప్రారంభోత్సవానికి ముందు అక్కడి పురోహితులు ప్రత్యేక యజ్ఞాలు.
- ప్రపంచానికి ఐక్యతను, సామరస్యాన్ని చాటిచెప్పడమే ఈ దేవాలయ ఉద్దేశం.
- శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ మతాలకు చెందిన 60 మంది.
- భారత సహకారంతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామన్న బాప్స్ డైరెక్టర్ ప్రణవ్ దేశాయ్.