ETV Bharat / international

ఇరాన్‌కు చైనా వార్నింగ్- నౌకలపై దాడులు ఆపకపోతే వ్యాపార సంబంధాలు కట్​! - హౌతీ దాడులపై చైనా

China On Houthi Attacks : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులను అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్‌లు తీవ్రంగా యత్నిస్తుండగా ఈ జాబితాలోకి పరోక్షంగా చైనా చేరింది. యెమెన్‌లోని హౌతీలతో పాటు పలు మిలింటెంట్ గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్న ఇరాన్‌ను చైనా హెచ్చరించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నౌకలపై దాడులు ఆపకపోతే ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు తెంచుకునేందుకు డ్రాగన్ సిద్ధపడినట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాల కోసం కాకపోయినా తన స్వలాభం కోసం చైనా ఈ మేరకు యోచిస్తున్నట్టు సమాచారం.

China On Houthi Attacks
China On Houthi Attacks
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 3:27 PM IST

China On Houthi Attacks : ఎర్ర సముద్రంలో కొన్ని రోజులుగా వాణిజ్య నౌకలపై ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో గాజాకు మద్దతు ఇస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. హౌతీలను నియంత్రించేందుకు అమెరికా, బ్రిటన్‌ తీవ్రంగా యత్రిస్తున్నాయి. వారి స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఇన్ని రోజులు హౌతీల అంశాన్ని తేలికగా తీసుకున్న చైనా, తమ వాణిజ్యంపై హౌతీ దాడులు ప్రభావం చూపుతుండటం వల్ల చర్యలు తీసుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

వాణిజ్యంలో 12 శాతం ఈ మార్గం ద్వారానే!
హౌతీలను ప్రోత్సహిస్తున్న ఇరాన్‌తో ఇటీవలే బీజింగ్, టెహ్రాన్‌లలో జరిగిన పలు సమావేశాల్లో వాణిజ్య నౌకలపై దాడుల అంశం వచ్చినట్టు ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా, ఐరోపాలకు గల్ఫ్- ఆఫ్‌-ఎడెన్‌ కీలక వాణిజ్య మార్గం. ఈ మార్గం నుంచే చైనా నౌకలు విస్తృతంగా సరకు రవాణా చేస్తుంటాయి. అంతర్జాతీయ సాగర వాణిజ్యంలో 12 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.

ఇరాన్‌పై చైనా ఒత్తిడి
చమురు, ఆహార ధాన్యాలు, సహజ వాయువు దగ్గర నుంచి బొమ్మలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకూ ఈ మార్గంలో రవాణా అవుతుంటాయి. హౌతీల దాడులతో ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్‌ కంపెనీలు ఈ మార్గాన్ని వీడుతున్నాయి. షిప్పింగ్ , బీమా ఖర్చులు భారీగా పెరగడం వల్ల డ్రాగన్‌కు నష్టం వాటిల్లుతోంది . దీంతో హౌతీ రెబెల్స్​కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌పై చైనా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

మంత్రి పరోక్ష వ్యాఖ్యలు
వాణిజ్య విశ్లేషణ సంస్థ K.P.L.E.R ట్యాంకర్ ట్రాకింగ్ డేటా ప్రకారం గతేడాది ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం చైనాకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన క్రమంలో డ్రాగన్ దేశం మాత్రం భారీగా డిస్కౌంట్లు పొంది లాభపడింది. తాజాగా పరిస్థితులు మారడం వల్ల ఎర్రసముద్రంలోని పరిణామాలపై ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాంగ్ యీ పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

'శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాం'
గల్ఫ్-ఆఫ్-ఎడెన్‌లో దాడులు చేస్తున్న వారు ఆపాలని ఇరాన్, హౌతీల పేరు చెప్పకుండా హెచ్చరించారు. నౌక దాడులపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ, మధ్యప్రాచ్య దేశాలకు చైనా నిజాయితీగల స్నేహితుడని, ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఉమ్మడి అభివృద్ధి, శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నట్టు చెప్పింది.

కేవలం 10 శాతం మాత్రమే!
ఇరాన్ నుంచి చైనాకు భారీగా సరకులు ఎగుమతి అవుతున్నప్పటికీ అవి చైనా దిగుమతుల్లో కేవలం 10 శాతం మాత్రమేనని సమాచారం. ఒకవేళ ఇరాన్‌తో సంబంధాలు తెగిపోయినా ఈ కొరతను పూడ్చడానికి చైనాకు పలు దేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హౌతీల విషయంలో ఇరాన్‌పై డ్రాగన్ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. వాణిజ్యంలో చైనాకు ఇరాన్ ముఖ్యం కానప్పటికీ ఇరాన్‌కు బీజింగ్ కీలకం. వాణిజ్య పరంగా దెబ్బతినే పరిస్థితి ఉండటం వల్ల హౌతీల విషయంలో ఇరాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

హౌతీ రెబల్స్​ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం- ఐదుగురు మృతి

అమెరికా వాణిజ్య నౌకపై హౌతీల దాడి- సముద్రంలో భీకర పోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.