ETV Bharat / international

కమలా హారిస్​కు మద్దతుగా ఏఆర్ రెహమాన్ వీడియో - అరగంట వింటే చాలు - ఓటర్లలో ఫుల్ జోష్ ఖాయం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రెహమాన్​ హిట్ సాంగ్స్​ + వారి సందేశాలు కూడా!

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

AR Rahman Concert In Harris Campaign
AR Rahman Concert In Harris Campaign (AP)

AR Rahman Video To Support Harris : డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​కు మద్దతుగా భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రంగంలోకి దిగారు. హారిస్​కు మద్దతుగా 30 నిమిషాల ప్రదర్శన వీడియోను ఆయన రికార్డ్ చేశారు. దీంతో హారిస్​కు మద్దతుగా ప్రచారం చేయనున్న తొలి దక్షిణాసియా కళాకారుడిగా రెహమాన్ నిలిచారు. రెహమాన్ రికార్డు చేసిన ఈ వీడియో కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి మంచి ఊపునిస్తుందని భావిస్తున్నారు.

'రెహమాన్ స్వరం కలిపినట్లైంది'
అమెరికా పురోగతి కోసం ఇప్పటికే నిలబడ్డ నాయకులు, కళాకారుల బృందానికి ఈ ప్రదర్శన ద్వారా ఏఆర్ రెహమాన్ తన స్వరాన్ని కలిపినట్లు అయిందని ఆసియా అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) విక్టరీ ఫండ్ ఛైర్మన్ శేఖర్ నరసింహన్ తెలిపారు. ఏఆర్ రెహమాన్ ప్రదర్శన సంగీత కార్యక్రమం మాత్రమే కాదని, ఆసియా ప్రజలు చూడాలనుకుంటున్న అమెరికా కోసం కమ్యూనిటీ ఓటు వేయాలనే పిలుపని పేర్కొన్నారు.

అక్టోబరు 13న రిలీజ్
అమెరికాలోని దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏఏపీఐ విక్టరీ ఫండ్ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో కమలకు మద్దతుగా రెహమాన్ రూపొందించిన వీడియోను ఏఏపీఐ విక్టరీ ఫండ్ యూట్యూట్ ఛానల్​లో అక్టోబరు 13న రాత్రి 8 గంటలకు ప్రసారం చేయనుంది. అలాగే ఏవీస్ లేదా టీవీ ఆసియా సహా దక్షిణాసియా నెట్​వర్క్​లలో ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ వీడియోలో ఏఆర్ రెహమాన్ హిట్ సాంగ్స్​తో పాటు, కమల హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన వారి సందేశాలు ఉంటాయి.

ట్రంప్ భద్రతపై ప్రచార బృందం ఆందోళన
మరోవైపు, ఇరాన్ నుంచి బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్​నకు మెరుగైన భద్రతను అందించాలని ఆయన ప్రచార బృందం బైడెన్ సర్కార్​ను కోరింది. క్షిపణులను కూల్చివేయగల సైనిక విమానం, ప్రత్యేక వాహనాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే రెండు సార్లు ట్రంప్​పై హత్యాచార యత్నం జరిగిన నేపథ్యంలో ఆయన ప్రచార బృందం ఈసారి ప్రభుత్వాన్ని సైనిక విమానం కోరింది.

నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయమే ఉండడం వల్ల రిపబ్లికన్ పార్టీ నామినీ డొనాల్ట్ ట్రంప్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

'ట్రంప్ తన అహం, డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటారు': బరాక్ ఒబామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.