ETV Bharat / health

గుండెల్లో మంట, ఉబ్బరం, జీర్ణ సమస్యలు- అల్లం ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలివే! - Side Effects of Eating Ginger Daily

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 4:22 PM IST

Side Effects of Eating Ginger Daily : అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ముఖ్యంగా జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుందని అందరికీ తెలిసిందే. కానీ అతిగా అల్ల తిసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందో తెలుసా?

Side Effects of Eating Ginger Daily
Side Effects of Eating Ginger Daily (Getty Images)

Ginger Health Benefits And Side-Effects : మన డైలీ తాగే ఛాయ్​లో కాస్త అల్లం దంచి వేశామంటే ఆ రుచే వేరు. ముఖ్యంగా జలుబు, గొంతులో కిచ్ కిచ్ వంటి సమస్యలున్నప్పుడు అల్లం తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు, కూరల్లో కూడా భారతీయులు దీన్ని మిస్ చేయకుండా వాడతారు. అల్లం ఆహార పదార్థాలకు మంచి వాసనను, రుచిని అందిస్తుంది కనుక దీన్ని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వాడతారు. ఆరోగ్య ప్రయోజనాల్లోనూ అల్లం ఏం తక్కువ చేయదని నిపుణులు చెబుతుంటారు. జింజర్ షోగోల్, జింజెరోన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి ఆహారం రుచిని పెంచడం సహా ఔషధ లక్షణాలను జోడించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

అయితే ఇవన్నీ అల్లం మితంగా తిన్నప్పుడే జరుగుతాయట. మంచిది కదా అని అతిగా తీసుకుంటే ఏ ఆహారమైనా అనారోగ్యానికి దారితీస్తుంది. అల్లం కూడా ఆ కోవకు చెందిందేనని కొన్ని స్టడీలు చెబుతున్నాయి. అల్లం అతిగా తినడం వల్ల కొన్ని ప్రతికూల ప్రయోజనాలను ఎదుర్కోవాల్సి వస్తుందట.

జీర్ణ సమస్యలు: సాధారణంగా అరుగుదల బాగా లేనప్పుడు, వికారంగా అనిపించినప్పడు అల్లం తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. అలాగని అతిగా తిసుకున్నారంటే సమస్య మరింత పెద్దది అవుతుంది. అల్లం అతిగా తినడం వల్ల కొందరికి గుండెల్లో మంట, ఉబ్బరం, జీర్ణ సమస్యలు వంటివి తలెత్తుతాయి.

రక్తం పలుచబడటం: అల్లంలో సహజంగా రక్తాన్ని పలుచబరిచే లక్షణాలుంటాయి. ఇవి రక్తప్రసరణతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయినప్పటికీ అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం బాగా పలుచగా మారి రక్తస్రావ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా రక్తస్రావ రుగ్మతలు ఉన్నవారు అల్లం ఎక్కువ తినకూడదు.

మెడిసిన్ ప్రభావాల విషయంలో: మధుమేహం, రక్తపోటు సహా రక్తం పలుచబడటానికి మెడిసిన్ వాడుతున్న వారు అల్లం ఎంత తక్కువ తింటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఔషధ గుణాల సంకర్షణల కారణంగా అల్లం ఎక్కువగా తింటే ఈ మెడిసెన్ల ప్రభావం తగ్గి ప్రతికూల ప్రయోజనాలను కలిగిస్తుంది.

అలెర్జీలు: అల్లం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొందరికి అలెర్జీ సమస్యలను తెచ్చిపెడుతుందని మీకు తెలుసా. అతిగా తినడం వల్ల దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ప్రతిచర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం గలవారికి అలెర్జీ సమస్యలున్నారికి మరిన్ని ఇబ్బందులు కలిగే ప్రమాదముంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మొటిమలు, మచ్చలు తగ్గట్లేదా? ఈ ఔషధం వాడితే చాలు - మీ ముఖం తలతలా మెరవడం ఖాయం! - Ginger Lime Scrub Benefits

ఆరోగ్యానికి మంచిదని 'అల్లం' ఎక్కువగా తీసుకుంటున్నారా? - మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? - Ginger Side Effects

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.