ETV Bharat / health

ముఖంపై రంధ్రాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేస్తే ఈజీగా క్యూర్​ చేయొచ్చు! - Main Reason For Face Pores

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 11:31 AM IST

What Are The Main Reason For Face Pores : ముఖంపై కనిపించే రంధ్రాలు అసహ్యంగా, చిరాకు పెడతాయి. వీటి కారణంగా చాలా మంది నిరాశ పడుతుంటారు. అయితే వీటిని శాశ్వతంగా తగ్గించేందుకు క్రీములు వాడితే సరిపోతుందా? వేరే ఏమైనా చేయాలా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

What Are The Main Reason For Face Pores
What Are The Main Reason For Face Pores (GettyImages)

What Are The Main Reason For Face Pores : ముఖంపై కనిపించే రంధ్రాలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి మీ మొత్తం రూపాన్ని, అందాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిని తగ్గించడానికి చాలా మంది ఎన్నో రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడతారు. అయినా ఫలితం మాత్రం పెద్దగా కనిపించదు!. ఎందుకంటే చర్మపు రంధ్రాలను పొగొట్టుకోవడానికి కేవలం మార్కెట్లో దొరికే క్రీములు వాడితే సరిపోదు, అవి రావడానికి గల కారణాలను గురించి తెలుసుకుని దానికి తగ్గట్టుగా పరిష్కారం వెతకాలి. వాస్తవానికి ముఖంపై పెద్ద పెద్ద రంథ్రాలు రావడానికి ఆశర్చర్యకరమైన కొన్ని కారణాలున్నాయట. అవేంటో తెలుసుకుందాం.

1. వారసత్వం:
మీ చర్మ రంధ్రాల పరిమాణం విషయంలో మీకు వారసత్వంగా వచ్చిన జన్యువులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీ తల్లిదండ్రులు లేదా బంధువులకు ముఖంపై పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటే ఆ లక్షణాలను మీరు పొందే అవకాశం ఉంటుంది. జన్యుశాస్త్రం ప్రకారం చర్మం రకం, నూనె ఉత్పత్తి, రంధ్రాల పరిమాణం వంటి వాటికి జన్యువులు కారకాలుగా మారతాయి. జన్యువులను మనం మార్చలేనప్పటికీ కారణాన్ని అర్థం చేసుకోవడం వల్ల వాటి నివారణ కోసం దినచర్యలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని సమస్య నుంచి బయటపడచ్చు.

2. వృద్ధాప్యం:
వయసును బట్టి చర్మపు రంధ్రాల విస్తరణ సహజంగా మారుతూ వస్తుంది. చర్మ కణాల్లో స్థితిస్తాపకత క్రమంగా కోల్పోవడం ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. అలాగే చర్మం తిరిగి జీవం పోసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోవడం కూడా రంధ్రాల ఏర్పడటానికి, సాగిపోవడనానికి దారితీస్తుంది. అదనంగా చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి కూడా వయసుతో పాటు తగ్గుతుంది. ఫలితంగా చర్మం దృఢత్వాన్ని, స్థితిస్తాపకతను కోల్పోతుంది. చర్మపు రంధ్రాలను మరింత పెంచుతుంది. పెరుగుతున్న వయసును మనం ఆపలేనప్పటికీ చర్మ స్థితిస్తాపకత, దృఢత్వాన్ని మెరుగుపరిచడంపై దృష్టి పెడితే రంధ్రాల సమస్యను తగ్గించుకోవచ్చు.

3. హార్మోన్లు:
ముఖంపై వచ్చే రంధ్రాలకు శరీరంలోని హార్మోన్ల హెచ్చు తగ్గులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. యుక్తవయస్సు, గర్భధారణ సమయంలో లేదా హార్మోన్ల అసమతుల్యత కారణంగా శరీరంలో ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇలా హార్మోన్ల మార్పులు చర్మంలో నూనె ఉత్పత్తికి కారణమయ్యే సేబాషియస్ గ్రంథులను ప్రేరిపిస్తాయి. ఫలితంగా చర్మంపై పెద్ద పెద్ద రంధ్రాలు, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. జీవనశైలిలో మార్పులు, ఆహారంలో సర్దుబాట్టు, చమురు ఉత్పత్తిని సమతుల్యం చేయడానికి రూపొందించిన చర్మ సంరక్షణ ఉత్పత్తుల ద్వారా హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిచవచ్చు. ఫలితంగా రంధ్రాల పరిమాణాన్ని తగ్గించవచ్చు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సైట్​ పెరుగుతుందా? ఈ కూరగాయలతో కంటి చూపును కాపాడుకోండిలా! - Eyesight Imporving Vegetables

ధనియాలతో ఈజీగా వెయిట్​ లాస్​! ఇలా తీసుకున్నారంటే ఊహించని ఫలితాలు ఖాయం!! - Benefits Of Soaked Coriander Water

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.