Habits to Stay Young and Energetic : ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే మీరు అలవర్చుకోవాల్సిన మొదటి అలవాటు.. మార్నింగ్ స్కిన్కేర్కు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. డైలీ క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటి బేసిక్ స్కిన్‌కేర్‌ను ఫాలో కావడం ద్వారా.. చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సూర్యరశ్మి రక్షణ జాగ్రత్తలు : చర్మం ముడతలు పడకుండా, ఎండ కారణంగా చర్మం దెబ్బతినకుండా ఉండటానికి ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి. క్లౌడీ డేస్‌లో కూడా దీనిని ఉపయోగిస్తే మంచిదట. కాబట్టి మీరు యవ్వనంగా కనిపించాలంటే ఈ అలవాటు ఫాలో కావాల్సిందే అంటున్నారు నిపుణులు.
పులియబెట్టిన ఆహారాలు : హెల్తీగా ఉండడంలో ఆహారపు అలవాట్లు కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పులియబెట్టిన ఆహారాలు కూడా మంచివని చెబుతున్నారు. ఇవి ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటాయి. ఫలితంగా జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. యవ్వనంగా ఉండడానికి దోహదం చేస్తాయట.
వాటర్ : సంపూర్ణ ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే రోజంతా తగినంత వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే హైడ్రేటెడ్‌గా ఉండడానికి, టాక్సిన్స్ బయటకు పంపడానికి, చర్మం తాజాగా ఉండడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగాలని చెబుతున్నారు. "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ సైన్స్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. తగినంత నీరు తాగడం వల్ల చర్మ హైడ్రేషన్ మెరుగుపడుతుందని.. అది అందాన్ని పెంచుతుందట.
నిద్ర : హెల్తీగా ఉండడానికి పాటించాల్సిన మరో అలవాటు.. రోజులో తగినంత నిద్ర పోవడం. ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా మారాలంటే మీ లైఫ్స్టైల్లో రోజూ మంచి నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల ఆరోగ్యంతోపాటు అందం కూడా మెరుగు పడుతుందని సూచిస్తున్నారు. 2019లో "PLOS ONE" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నిద్రకు, అందానికి మధ్య ముఖ్యమైన రిలేషన్ ఉంది. సరైన నిద్రపోకపోతే.. ముఖంపై త్వరగా ముడతలు వచ్చే ఛాన్స్ ఉంది. కంటి నిండా నిద్రపోయిన వారి ముఖం తాజాగా ఉంటుంది.
మీ ఇంట్లో తరుచూ అనారోగ్యం వేధిస్తోందా? - ఈ వాస్తు పాటించాల్సిందేనట!
వ్యాయామం : శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కోసం డైలీ వ్యాయామం చాలా అవసరం. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి మూలంగా నిలుస్తుంది. డైలీ వాకింగ్, సైక్లింగ్, డ్యాన్స్ వంటి రకరకాల ఎక్సర్సైజ్లు చేయొచ్చు.
రిలాక్సేషన్ టెక్నిక్స్ : ఎప్పుడూ ఒత్తిడిని దరిచేరనీయకుండా చూసుకోవాలి. ఇందుకోసం రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో కావాలి. ఇందుకోసం యోగా, ధ్యానం లేదా ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం వంటివి చేయాలి. మీరు కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ అలవాట్లను అనుసరించాలి.
సామాజిక బంధాలు : కుటుంబం, స్నేహితులతో బలమైన సామాజిక బంధాలకు విలువ ఇవ్వండి. వారితో ఎక్కువ టైమ్ గడపడానికి ప్రయత్నించండి. స్ట్రాంగ్ సోషల్ రిలేషన్‌షిప్స్‌తో.. ఆనందం, ఆరోగ్యం, దీర్ఘాయువును పెంచుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మైండ్‌ఫుల్ ఈటింగ్ : ఆరోగ్యంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన మరో అలవాటు మైండ్‌ఫుల్ ఈటింగ్. ఎప్పుడు తింటున్నాం? ఎందుకు తింటున్నాం? ఎలా తింటున్నాం? అన్నదానిపై శ్రద్ధ పెట్టాలి. నెమ్మదిగా తినాలి. మెత్తగా నమిలి తినాలి. దీంతోపాటు షుగరీ డ్రింక్స్, ఆల్కహాల్, కెఫిన్‌కి దూరంగా ఉండాలి.
నోట్ : పైన పేర్కొన్న వివరాలు నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించాం. ఈ స్టోరీ కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యం, అందానికి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా వైద్యులను సంప్రదించడమే బెటర్. ఈ విషయాన్ని పాఠకులు గమనించగలరు.
ఇలా చేస్తే బరువు తగ్గడం దేవుడెరుగు - గుండెపోటుతో పోవడం ఖాయమట! - సంచలన రీసెర్చ్!