ETV Bharat / health

వేసవిలో జలుబును తగ్గించుకోవడం ఎలా? మీకోసం 5 సింపుల్ టిప్స్! - Summer Cold Remedies - SUMMER COLD REMEDIES

Summer Cold Remedies : వానాకాలంలో, చలికాలంలో జలుబు సాధారణమే. కానీ వేసవి కాలంలో జలుబు రావడమేంటి ? చాలా అరుదుగా వచ్చే వేసవి జలుబును తగ్గించుకోవడం ఎలా?

Summer Cold Remedies
Summer Cold Remedies
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 2:09 PM IST

Summer Cold Remedies : సాధారణంగా శీతాకాలంలో, వర్షాకాలంలో చాలా మందికి జలుబు చేస్తుంది. వేసవి కాలంలో ముక్కు కారడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. దీన్నే సమ్మర్ కోల్డ్ అని పిలుస్తుంటారు ఆరోగ్య నిపుణులు. వాతావరణంలో మార్పులు, విపరీతమైన వేడి కారణంగా ఎండాకాలంలోనూ కొందరికి జలుబు చేస్తుంది. తుమ్ములతో పాటు దగ్గు, జ్వరం, కండరాల నొప్పులు, నోట్లో పొక్కులు, గొంతు నొప్పి, గొంతులో మంట వంటి సమస్యలు కూడా వేసవి కాలంలో వస్తుంటాయి. కారణాలేవైనప్పటికీ జలుబు చేస్తే ఏ పని మీద ధ్యాస పెట్టలేం. ముక్కు దిబ్బడ మనిషిని అస్సలు ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. వేసవి కాలంలో వచ్చినా సరే జలుబు దాదాపు వారం రోజుల వరకు ఇబ్బంది పెడుతుంది. వేసవి కాలంలో వచ్చే ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం రావడానికి ఇంట్లోనే కొన్ని నివారణలు ఉన్నాయట. అవేంటంటే.

1. హైడ్రేషన్
జలుబు చేసినప్పుడు బాగా ఇబ్బంది కలిగించే సమస్య శ్లేష్మం. గొంతులో, ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మం ఊపిరానివ్వకుండా చేస్తుంది. ఇది తగ్గడానికి శరీరం హైడ్రేటెడ్​గా ఉండటం చాలా అవసరం. వేసవి జలుబు నుంచి మరింత త్వరగా తప్పించుకునేందుకు గోరు వెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగచ్చు. ఉప్పు నీటిని ఎక్కువ సార్లు పుక్కిలించాలి.

2. విటమిన్-సీ
విటమిన్-సీ, విటమిన్-కే అధికంగా ఉండే కూరగాయలు, ఆహారాలు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే వేసవిలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు.

3. కొత్తిమీర
విపరీతమైన జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు కొత్తిమీర ఆకులను మిక్సీలో వేసి మందపాటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నుదిటిపై అప్లై చేసుకుని కాసేపు ఉంచుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. కొత్తిమీరలోని విటమిన్-సీ జలుబు, ఫ్లూను త్వరగా నయం చేసేందుకు సహాయపడుతుంది.

4. అల్లం, తాటి బెల్లం
జలుబు కారణంగా గొంతులో కలిగే ఇబ్బందికి అల్లం, తాటి బెల్లం చక్కటి ఇంటి నివారణగా చెప్పుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా తాజా అల్లం ముక్కను తీసుకుని సన్నగా తురుముకోవాలి. మరుగుతున్న నీటిలో ఈ అల్లం ముక్కలు, తాటి బెల్లం వేసి కాసేపు మరగనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి వేడి వేడిగా తాగాలి.

5. యూకలిప్టస్
మరుగుతున్న నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పీల్చుకోవడం వల్ల ముక్కుకు, గొంతుకు శ్లేష్మం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. యూకలిప్టస్ బదులుగా కొబ్బరి నూనె, జోజోబా నూనెను వేడి చేసి ఛాతి, గొంతుకు రాసుకోవడం వల్ల కూడా సమ్మర్ కోల్డ్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది.

వీటితో పాటు తరచుగా చేతులను కడుక్కోవడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల క్రిముల నుంచి రక్షణ పొందచ్చు. అలాగే రోజూ కనీసం 7-9 గంటల పాటు నిద్రపోవడం వల్ల కూడ శరీరం జబ్బుల నుంచి త్వరగా కోలుకుంటుంది. శారీరక శ్రమ, వ్యాయామం లాంటివి చేసి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వల్ల అన్ని కాలాల్లో ఆరోగ్యంగా ఉండవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.