Best Pimples Remove Face Packs : చాలా మందికి యుక్తవయసులోనే మొటిమలు వస్తాయి. కానీ.. కొందరికి పెళ్లి తర్వాత మొటిమలు ఇబ్బందిపెడుతుంటాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధ పడుతుంటే.. ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
మొటిమలు తగ్గడానికి సూపర్ ప్యాక్ : ఒక బౌల్ తీసుకొని, అర చెంచా చొప్పున ముల్తానీమట్టి, జీలకర్ర, ధనియాలు, లవంగం, బార్లీ పౌడర్ తీసుకోవాలి. ఇవన్నీ ముందే పొడి చేసి పెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత సరిపడినంత రోజ్‌వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని మొటిమలు ఉన్న చోట మాత్రమే అప్లై చేసుకోవాలి. దాన్ని 20 నిమిషాలపాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోవాలి.
2011లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ముల్తానీ మట్టి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చంఢీగడ్‌లోని 'Postgraduate Institute of Medical Education and Research'కు చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ A. Gupta పాల్గొన్నారు. ముల్తానీ మట్టితో ప్రిపేర్ చేసుకునే ప్యాక్‌లు మొటిమల నివారణకు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ అలవాట్లు మీలో ఉంటే - ఒక్క మొటిమ కూడా మీ ముఖంపై కనపడదు! పైగా గ్లోయింగ్ స్కిన్ పక్కా!
మచ్చలు తగ్గడానికి ప్యాక్ : ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో అరచెంచా చొప్పున కలబంద గుజ్జు, రోజ్‌వాటర్, పావు చెంచా తేనె తీసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు ఉన్న ప్లేస్‌లో అప్లై చేసుకోవాలి. పావుగంట పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ ప్యాక్‌లను.. వారానికి 3 నుంచి 4 సార్ల చొప్పున రెండు లేదా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వాడడం ద్వారా క్రమంగా మొటిమలు తగ్గడమే కాకుండా మచ్చలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మొటిమలు, మచ్చలు ఈ రెండు సమస్యలు ఉన్నవారు వీటిని ఒకేసారి అప్లై చేయకూడదు. ముందుగా.. మొటిమల నివారణకు ప్యాక్ వేసుకొని తర్వాత మచ్చల నివారణకు ప్యాక్ వేసుకోవడం మంచిది అంటున్నారు.
అలా కాదనుకుంటే.. వారానికి 4 సార్లు ముల్తానీమట్టి ప్యాక్, మిగతా రోజుల్లో కేవలం మచ్చలు ఉన్న ప్లేస్‌లో మాత్రమే కలబంద గుజ్జు ప్యాక్‌ని అప్త్లె చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అదేవిధంగా.. మొటిమలు రాకుండా ఉండడం కోసం ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం, పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడు మార్చుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం.. వంటివి చేయాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎంతటి మొటిమలైనా ఈ టిప్స్ పాటిస్తే క్లియర్! మీరూ ట్రై చేస్తారా? - Tips to Prevent Acne Problems