ETV Bharat / health

టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగొచ్చా? కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందా? - side effects of reheating tea

Reheated Tea Side Effects In Telugu : మనలో చాలా మంది ఎప్పుడో తయారు చేసిన టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతారు. మరి అలా తాగొచ్చా? ఆరోగ్య సమస్యలేమైనా తలెత్తే అవకాశం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Reheated Tea Side Effects In Telugu
Reheated Tea Side Effects In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 12:54 PM IST

Reheated Tea Side Effects In Telugu : టీ/చాయ్​- మన దేశంలోని చాలా మంది ప్రజలకు ఒక కామన్ ఎమోషన్. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అనేక మంది కనీసం రెండు మూడు సార్లు టీ తాగుతుంటారు. కొంతమందికైతే టీ లేనిదే అసలు రోజు గడవదు, ఏ పని సక్రమంగా కూడా చేయలేరు! అంతలా అలవాటు పడ్డారు మనవాళ్లు. అయితే బయట షాపుల్లో, ఇంట్లో మనం ఎంతో ఇష్టంగా తాగే టీ కొన్నిసార్లు మన ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశం ఉంది. అదెలా అంటే?

సాధారణంగా కొందరు ఎప్పుడు టీ తాగాలనిపిస్తే అప్పుడే తయారు చేసుకుని తాగుతారు. మరికొందరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు బయటకు వెళ్లి మరీ తాగుతారు. ఇంకొందరు మాత్రం ఒకేసారి ఎక్కువ టీ తయారు చేసి పక్కన పెట్టుకుంటారు. దాన్ని కొన్ని గంటల పాటు అలా వదిలేసి మళ్లీ మళ్లీ మరగబెట్టుకుని సేవిస్తుంటారు. అలా చేస్తే ఆరోగ్యానికే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణాలను కూడా వివరిస్తున్నారు.

1. బ్యాక్టీరియా :
టీని అలా చాలా సమయం వదిలేస్తే అందులో బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే మళ్లీ మళ్లీ వేడి చేసుకుని టీని తాగకూడదు.

2. ఫుడ్ పాయిజన్ :
అయితే టీని మళ్లీ మళ్లీ మరిగిస్తే అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియా ఇంకా పెరిగే అవకాశం ఉంది. టీ రుచిని కూడా కోల్పోతుంది. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది.

3. పోషకాలు మాయం!
హెర్బల్​ టీని మళ్లీ మళ్లీ వేడి చేస్తే అందులో పోషకాలు మాయమవుతాయి. అంతే కాకుండా ఆ టీ హానికరంగా మారుతుంది.

4. అనేక ఆరోగ్య సమస్యలు
చాయ్​ను తరచుగా వేడి చేసి తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. కడుపు నొప్పి, విరేచనాలు, తిమ్మిర్లు, ఉబ్బసం ఇతర జీర్ణ సమస్యలకు దారితీయవచ్చని అంటున్నారు. టీని ఎక్కువసేపు నిల్వ ఉంచడం వల్ల టానిన్ అధికంగా రిలీజ్ అయ్యి చేదుగా కూడా మారుతుందని, అది ఆరోగ్యానికి మంచిది కాదని వివరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.