ETV Bharat / health

మీ మానసిక ఒత్తిడికి - మీ గట్ సిస్టమే కారణం కావొచ్చని తెలుసా? - Gut Health

Poor Gut Health Can Trigger Stress : మన శరీర ఆరోగ్యం.. గట్ హెల్త్​ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అదే పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ, గట్ హెల్త్ సరిగా లేకపోతే ఒత్తిడిని ప్రేరేపిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Stress
Gut Health
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 10:26 AM IST

Poor Gut Health Can Trigger Stress : మనం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం చాలా అవసరం. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో గట్(పేగుల వ్యవస్థ) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాడీలో మిగిలిన వ్యర్థాలనూ సమర్థవంతంగా బయటకు పంపుతుంది. ఇలాంటి గట్​ సిస్టమ్​ బలహీనంగా మారితే మాత్రం.. జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. అయితే.. ఇదొక్కటే మరో తీవ్రమైన సమస్యకూ గట్ అనారోగ్యం కారణమవుతుందట! అదే మానసిక సమస్య. మానసిక ఒత్తిడి(Stress)కి.. గట్ సిస్టంకు బలమైన బంధం ఉందని చెబుతున్నారు.

సాధారణంగా పొట్టలో ​లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మొదట జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఆ కారణంగా అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్‌, గుండెల్లో మంట, పొత్తికడుపు తిమ్మిరి వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితోపాటుగా.. గట్ సిస్టమ్ హెల్తీగా లేకపోతే మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మన బాడీలో హానికర బ్యాక్టీరియాతోపాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అయితే.. కొన్నిసార్లు మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం, పర్యావరణ కారకాలు, అంటువ్యాధులు వంటివి పొట్టలో అసమతుల్యతకు దారి తీస్తాయి. అవి మంచి బ్యాక్టీరియాను దెబ్బ తీస్తాయి. ఈ పరిస్థితి గట్​ లైనింగ్​ను ఎఫెక్ట్ చేస్తుంది. దీంతో.. పేగుల నుంచి వెలువడే హానికరమైన పదార్థాలు, టాక్సిన్స్ రక్తప్రవాహంలోకి ప్రవేశించడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఆ పదార్థాలు రోగనిరోధక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపడంతోపాటు వాపును ప్రేరేపిస్తాయి.

దీంతో.. పేగులలో తలెత్తిన ఇన్​ఫ్లమేషన్ మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఇది ప్రాథమిక ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదలకు దారి తీస్తుంది. గట్​లో తలెత్తిన ఈ ఇన్​ఫ్లమేషన్ దీర్ఘకాలంగా కొనసాగితే.. కార్టిసాల్ ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి మరింతగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల.. పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గించే కొన్ని మార్గాలు..

ఆరోగ్యకరమైన ఆహారం : పీచు, ప్రోబయోటిక్స్ , ప్రీబయోటిక్స్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల​ పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పుష్కలంగా నీరు తాగడం : రోజూ ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గట్ హెల్త్ మంచిగా ఉంటుంది.

వ్యాయామం : రెగ్యులర్​గా వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇది ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని వ్యాయామాలు : యోగా, ధ్యానం లేదా డీప్ బ్రీతింగ్ వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.

ఇవన్నీ చేయడం ద్వారా గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లేదంటే.. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఏ పనిపైనా ఏకాగ్రత చూపలేరు. ఎప్పుడూ చిరాగ్గా ఉంటారు. ఫలితంగా.. మొత్తం జీవనమే అస్తవ్యస్తమైపోతుంది.

పేగులు మెలిపెట్టే నొప్పి.. కారణాలేంటో తెలుసా..?

మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.