ROASTED CHANA BENIFITS : ఆరోగ్యవంతమైన శరీరానికి పోషకాహారం తప్పనిసరి. దైనందిన సమతుల ఆహారంలో ఆకుకూరలు, పప్పుదినుసులు, బీన్స్(చిక్కుడు), పాలు, పెరుగులాంటి పాల ఉత్పత్తులతో పాటు మాంసం, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ తీసుకోవాలి. అయితే పలు రకాల చిరుతిళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిరుతిళ్లు అనగానే ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది గానీ, శరీరానికి అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. చిరుతిళ్లు అంటే స్వల్పం అని, అంతేగాని చిరుతిళ్లను కూడా భోజనంలా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.
కాల్చిన శనగ(చనా) ప్రోటీన్ కంటెంట్ కండరాల మరమ్మతు, పెరుగుదలకు తోడ్పడుతుందని ఫిజిషియన్లు సూచిస్తున్నారు. మధుమేహ బాధితులకు కాల్చిన శనగలు దేవుడు ఇచ్చిన వరమే అని చెప్పుకోవాలి. శనగల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడడంతో పాటు జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. వీటిలో లభించే B విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీర ధారుడ్యానికి సహకరిస్తాయి. శరీరానికి అవసరమైన ఫైబర్ అందించడంతోపాటు కు తక్కువ గ్లైసెమిక్ లక్షణాన్ని కలిగి ఉన్నాయని గుండె వైద్య నిపుణులు డాక్టర్ సోమరాజు వెల్లడించారు.
ధనియాల కషాయం సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు- ఇలా చేయండి ఆశ్చర్యపోతారు! - coriander health benefits
కాల్చిన శనగల్లో గుండె జబ్బులను నివారించడంలో సహాయపడే విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఐరన్, సెలీనియం, మాంగనీస్, కాల్షియం, కాపర్, జింక్, పొటాషియం కావల్సిన మోతాదులో లభిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడంతో పాటు అవయవాలకు రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. గుండె లయను కాపాడడంలో సహకరిస్తాయి. మలబద్ధకాన్ని నివారించే ఫైబర్ మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రీ ప్రోబయోటిక్ కంటెంట్ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. - సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ సోమరాజు
కాల్చిన శనగ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నా అతిగా తీసుకుంటే ప్రమాదం కూడా లేకపోలేదు. బరువును నిర్దేశించే ఫైబర్, ప్రొటీన్ కాల్చిన చనాలో అధికంగా ఉంటుంది. దాంతో ఎక్కువగా తీసుకుంటే శరీర బరువు పెరిగే అవకాశాలున్నాయి. అవసరానికి మించి కేలరీలు తీసుకోవడం బరువు పెరగడానికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా ఫైబర్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడవచ్చు, ఉబ్బరం, గ్యాస్ పెరుగుతుంది. కాల్చిన చనాలో ప్యూరిన్‌లు గౌట్‌కు గురయ్యే వ్యక్తులకు ప్రమాదకరం. అధిక ప్యూరిన్ స్థాయిలు యూరిక్ యాసిడ్, కీళ్ల సమస్యలకు దారితీసే అవకాశాలున్నాయి. అతిగా తీసుకుంటే అతిసారం, ఉబ్బరం, ప్రేగులలో గ్యాస్, అలెర్జీల ముప్పు పొంచి ఉంటుంది. కాల్చిన చనా రోజూ 100 గ్రాములకు మించి తినవద్దు. మితిమీరిన వినియోగం దుష్ప్రభావాలకు దారి తీస్తుందని గుర్తుంచుకోవాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మధుమేహాన్ని తరిమికొట్టే మందులివే!- ఉదయాన్నే తీసుకుంటే రోజంతా ఉత్సాహమే - diabetes CONTROL food
అధిక వ్యాయామంతో గుండెపోటు!- ఈ లక్షణాలు కనిపిస్తే డేంజరే - HEART ATTACK SYMPTOMS