ETV Bharat / health

ఆయిల్ బాటిల్స్​? లేక స్ప్రేనా?  వంటింట్లో ఏది బెటర్​? - Oil Bottles Vs Sprays

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 8:34 AM IST

Oil Bottles Vs Oils Sprays : వంటింటి అవసరాలకు వినియోగించేందుకు నూనె డబ్బాలు బెటర్ ఆప్షనా? నూనెను స్ప్రే చేసే బాటిల్సా? ఈ రెండింట్లో ఏది బెటర్​ ఇప్పుడు తెలుసుకుందాం.

Oil Bottles Vs Oils Sprays
Oil Bottles Vs Oils Sprays (Getty Images)

Oil Bottles Vs Oils Sprays : భారతీయుల తమ వంటగదుల్లో తరతరాలుగా వాడుతూ ఉన్న నూనె డబ్బాలను మార్చమంటే ఒప్పుకుంటారా? వాటికి బదులుగా లేటెస్ట్‌గా నూనె స్ప్రేలు చేసుకునే పరికరాలను ఉపయోగించమంటే ఏం చేస్తారు? కచ్చితంగా సందిగ్దంలో పడిపోతారు. కానీ, ఈ విషయం తెలిసిన వారందరికీ మాత్రం ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాస్తవానికి మన ఆరోగ్యం విషయంలో ఇది ఒక గేమ్‌ఛేంజర్ కూడా. రీసెంట్‌గా ఒక ఇంగ్లీష్ మీడియాలో పబ్లిష్ అయిన కథనంలో ప్రముఖ న్యూట్రిషియన్ దీనిపై వాస్తవాలను వెల్లడించారు.

చాలా మంది వంట చేసేవారు తమ వంటకాల్లో కొలత లేకుండానే నూనెను పోసేస్తూ ఉంటారు. అలా వంట అయిపోయాక కూడా అది మిగిలిపోతే దానిని వేరే వంటకాలకు వినియోగిస్తుంటారు. ఇంకా కూరలు చేసే సందర్భాల్లో అయితే నూనె ఎక్కువైనప్పటికీ అలానే వదిలేస్తుంటారు. ఇలా చాలా వరకూ పోషకాలు కోల్పోయిన నూనెలను తిరిగి వంట చేసుకోవాల్సి రావడం వల్ల శరీరంలోకి అదనపు కొవ్వును చేర్చుకున్నట్లు అవుతుంది. పైగా రెగ్యూలర్‌గా కిచెన్లలో ఉండే వంట డబ్బాలు నెలల తరబడి క్లీన్ చేయకుండా ఉండిపోతాయి. ఫలితంగా వాటిల్లో పేరుకుపోయిన దుమ్ము ధూళి కొద్ది రోజుల పాటు వంటల్లో భాగమైపోతుంది.

కానీ, నూనె స్ప్రేలు అలా కాదు. వాడటానికి వీలుగానూ, కావాల్సిన మేరకే ఆయిల్ పోసేందుకు బాగా అనుకూలిస్తుంది. ఫలితంగా నూనె వేస్ట్ అవడమే కాకుండా సరిపడా ఆయిల్ మాత్రమే మనం ఆహారంలో చేర్చుకోగలుగుతాం. నూనె బాగా దట్టించి డీప్ ఫ్రైలు చేసుకుని క్యాన్సర్‌ బారినపడే ప్రమాదం నుంచి సురక్షితంగా ఉండగలం.

నూనెల వల్ల లాభాలు
పలు కుకింగ్ ఆయిల్స్​లో ఒక్కోదానిలో ఒక్కో రకంగా విటమిన్ ఏ, విటమిన్ ఈ, డీ, కేలు బీటా కెరోటిన్​తో ఉంటాయి. అందుకే చాలా వరకూ వంటనూనెలను మిక్సింగ్ చేసుకుని వాడమని చెబుతుంటారు. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే, ఒమెగా-3 ఎక్కువగా ఉండే ఫిస్ ఆయిల్ చాలా మంచిది. గుండెకు మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ కూడా మంచి కొవ్వుతో కూడి యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇక కొబ్బరినూనెలో మీడియం చైన్ ట్రైగిసరైడ్స్ ఉంటాయి. వెజిటేబుల్ ఆయిల్​లో జీర్ణక్రియ మెరుగుపరిచి మెటబాలిజం వృద్ధి చేసే గుణాలుంటాయి.

సాధారణంగా నూనెలను చాలా తక్కువ మొత్తంలో ఎక్కువ టెంపరేచర్ వరకూ వేడి చేసుకోవచ్చట. ఒక గ్రాము నూనెలో 9కిలో క్యాలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఎక్కువగా నూనెలు తినేవారిలో ఒబెసిటీ, గుండె జబ్బులతో పాటు ఇతర జబ్బులు కచ్చితంగా సంభవిస్తాయనేది స్పష్టమైనట్లే కదా. అందుకే నూనెల విషయంలో జాగ్రత్త మరి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.