Imli Dhaniya Water Benefits : చింతపండు నీరు, కొత్తిమీర ఆకులతో కమ్మగా చారు చేసుకుని తినొచ్చు. ఈ రెండింటినీ కలిపి కూరల్లోనూ వేసుకుని వండుకోవచ్చు. కానీ వీటితో మీ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అని మీకు తెలుసా. అవును.. వంటగదిలోని చాలా పదార్థాలు చర్మ సౌందర్యం విషయంలో అద్భుతాలు చేస్తాయి. అలాంటివాటిలో చింతపండు నీరు, కొత్తిమీర కాంబినేషన్ ఒకటి. వినడానికి చాలా కొత్తగా, వింతగా అనిపించినా వీటి కలయిక చర్మంపై చూపే ప్రభావాలు తెలిస్తే ఆశ్చర్యపోకతప్పదని చెబుతున్నారు ప్రముఖ డైటీషియన్ సోనియా నారంగ్. చింతపండు నీరు కొత్తిమీర ఆకులతో చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి వివరంగా తెలుసుకుందాం.
చింతపండులో సహజంగా లభించే పాలిసాకరైడ్ హైలురోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ సంరక్షణ విషయంలో అద్భుతమైన పదార్థం. మీ చర్మ రక్షణ కోసం మీరు ఉపయోగించే పదార్థాల్లో చింతపండును ఒకటిగా మార్చుకోవడం ద్వారా చర్మంపై గీతలు, నల్లటి మచ్చలు తగ్గుతాయని సోనియా నారంగ్ చెబుతున్నారు. చింతపండులో సమృద్ధిగా దొరికే విటమిన్-సీ, విటమిన్-కేలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.
హానికరమైన సూర్యకిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించిడమే కాక మొటిమల సమస్యను తగ్గిస్తుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సహాయపడి ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. ఇందులోని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ చర్మాన్ని ఎక్స్ ఫోలియట్ చేసి మరింత మృదువుగా, యవ్వనంగా మారుస్తాయి. దీంట్లో అధిక మొత్తంలో ఉండే పొటాషియం బిటారట్రేట్, మాలిక్, టార్టారిక్ ఆమ్లాలు జీర్ణవ్యవస్థను, ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
ఇక కొత్తిమీర విషయానికొస్తే, దీంట్లో ఖనిజాలు, విటమిన్లతో పాటు శరీరానికి అవసరమయే ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణలను కలిగి ఉన్నందున మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. చర్మం వాపు, పగుళ్లు వంటి సమస్యలను నిరోధించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు కొత్తిమీర చర్మానికి సహజ టోనర్‌గా పనిచేస్తుంది. రంథ్రాలను బిగుతులగా చేసి ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది.
ఇమ్లీ-ధనియా పానీ తయారీ విధానం
- ముందుగా చింతపండును తీసుకుని నీటిలో నానబెట్టాలి.
- గంట తర్వాత ఈ నీటిని తీసుకుని దాంట్లో శుభ్రంగా కడిగిన కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోవాలి.
- కాసేపటి తర్వాత ఈ చిక్కటి ఈ నీటిని ముఖానికి రాసుకోవాలి.
- 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
అంతే ఇమ్లీ-ధనియా పానీ రెడీ. కనీసం వారానికి ఒకసారి ఈ నీటిని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, చర్మంపై ముడతలు, గీతలు వంటి సమస్యలు తగ్గి యవ్వనంగా, మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజూ ఉదయం బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఎన్ని లాభాలో తెలుసా? వెయిట్ లాస్ పక్కా! - Black Coffee Benefits