ETV Bharat / health

రోజులో ఎంతసేపు కూర్చోవాలో మీకు తెలుసా? - పరిశోధనలో ఆసక్తికర విషయాలు! - How Many Hours to Sleep in a Day

How Many Hours to Sit Stand and Sleep in a Day : ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరైన నిద్ర, తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. కానీ.. చాలా మందికి రోజులో ఫిజికల్ యాక్టివిటీకి ఎంత టైమ్ కేటాయించాలి? ఎంతసేపు నిలబడాలి? కూర్చోవాలి? నిద్రపోవాలి? అనే విషయాల్లో క్లారిటీ ఉండదు. మీక్కూడా ఇలాంటి సందేహాలు ఉంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే!

How Many Hours to Sit Stand and Sleep in a Day
HEALTH CARE INFORMATION (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 3:03 PM IST

How Many Hours to Sit Stand and Sleep for Good Health : ఆరోగ్యంగా ఉండాంటే రోజులో ఎంత సమయం నిలబడాలి? కూర్చోవాలి? ఫిజికల్ యాక్టివిటీకి ఎంత టైమ్ కేటాయించాలి? అనే విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటి వారంతా ఇటీవల ఆస్ట్రేలియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం గురించి తెలుసు కోవాల్సిందే. మరి.. ఆ రీసెర్చ్​లో ఏం తేలిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాలోని స్విన్​బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో పాల్గొన్న 40-75 సంవత్సరాల వయస్సు గల 2,000 మంది ప్రవర్తనను విశ్లేషించారు. 24 గంటల వ్యవధిలో వారు తమ సమయాన్ని ఎలా గడిపారో విశ్లేషించి.. మెరుగైన ఆరోగ్యం కోసం కూర్చోవడం, నిద్రపోవడం(Sleeping), నిలబడడం, శారీరకంగా చురుకుగా ఉండటం కోసం ఒక వ్యక్తి రోజులో ఎంత సమయం కేటాయించాలో కనుగొన్నారు. ఈ పరిశోధన వివరాలు.. 'డయాబెటోలోజియా' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఆ జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మంచి ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి డైలీ 8 గంటల 20 నిమిషాలు నిద్రపోవాలని పరిశోధకులు సూచించారు. అలాగే రోజుకు 5 గంటల 10 నిమిషాలు నిలబడాలని, 6 గంటలు కూర్చోవాలని కనుగొన్నారు. అంతేకాదు.. రోజూ 4 గంటల 20 నిమిషాల పాటు తేలికపాటి నుంచి మితమైన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. తేలికపాటి శారీరక శ్రమ అంటే.. నడవడం నుంచి వంట చేయడం, ఇంటి పనులను పూర్తి చేయడం, అలాగే బిగ్గరగా నవ్వడం వరకు ఏదైనా కావచ్చని వారు తెలిపారు. అలాగే.. మితమైన శారీరక శ్రమ కోసం వాకింగ్ లేదా సైక్లింగ్, జాగింగ్, జంపింగ్, ఏరోబిక్ డ్యాన్స్‌ వంటివి చేస్తుండటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

మీకు వచ్చే రోగాల్లో 56 శాతం - కేవలం తిండి ద్వారానే! - ICMR కీలక సూచనలు!

అధ్యయనంలో తేలిన మరికొన్ని విషయాలు : తక్కువ కూర్చోవడం, ఎక్కువ నిలబడటం, శారీరక శ్రమ, నిద్ర.. మంచి కార్డియోమెటబాలిక్ ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అంతేకాదు.. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు. అలాగే.. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు కూర్చున్న సమయాన్ని శారీరక శ్రమతో ముఖ్యంగా తేలికపాటి కార్యకలాపాలతో భర్తీ చేసినప్పుడు రక్తంలో చక్కెర నియంత్రణలో గణనీయమైన మెరుగుదల ఉంటుందని వారు కనుగొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బిగ్ అలర్ట్ : నాన్​స్టిక్ పాత్రలు వాడితే ఏమవుతుందో తెలుసా? - ఐసీఎంఆర్ హెచ్చరికలు! - Nonstick Cookware Side Effects

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.