ETV Bharat / health

చంకలు నల్లగా మారాయా? - రోజూ ఈ టిప్స్‌ పాటిస్తే సరి! - Tips For Dark Underarms - TIPS FOR DARK UNDERARMS

Get Rid Of Underarm Blackness Naturally : ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా కూడా కొంత మంది చంకలు నల్లగా ఉంటాయి. దీంతో వారు స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లు వేసుకోవాంటే ఇబ్బంది పడుతుంటారు. అయితే, బ్లాక్ అండర్ ఆర్మ్స్ సమస్యతో బాధపడేవారు కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ మీ కోసం!

Underarm Blackness Naturally
Get Rid Of Underarm Blackness Naturally (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 1:30 PM IST

Get Rid Of Underarm Blackness Naturally : కొంత మంది చంకలు ఎంత శుభ్రం చేసుకున్నా కూడా అక్కడ అంతా నల్లగా ఉంటుంది. అయితే, ఇలా చంకల్లో నలుపుదనం ఏర్పడటానికి వివిధ కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైపర్ పిగ్మెంటేషన్ గాఢత ఎక్కువగా ఉండే డియోలు వాడటం, శుభ్రత పాటించకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇలా చంకల్లో నలుపుదనం ఉన్నవారు స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించాలంటే కాస్త ఇబ్బంది పడుతుంటారు. అయితే, కొన్ని టిప్స్‌ పాటించడం ద్వారా ఈజీగా నలుపు రంగును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కలబంద గుజ్జు :
చంకల్లో నలుపుదనం తగ్గించుకోవడానికి కలబంద గుజ్జు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని నలుపుదనం ఉన్నచోట అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఈ సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. చంకల్లో కలబంద జెల్‌ను రోజుకు రెండుసార్లు మహిళలు అప్లై చేసుకోవడం వల్ల, అక్కడ నలుపు తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్‌ డేవిడ్ డబ్ల్యూ. టెంగ్' పాల్గొన్నారు. కలబంద గుజ్జును అప్లై చేసుకోవడం వల్ల చంకల్లో నలుపు రంగు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

వంట సోడాతో : ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్‌ల వంట సోడా, కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను నలుపుదనం ఉన్నచోట అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

మీ ముఖం ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే - రాత్రి వేళ ఇలా చేయండి! - How to Cleanse Face Every Night

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో : మీరు ఈ సమస్యను తగ్గించుకోవడానికి.. ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్‌ల వంట సోడా, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను యాడ్‌ చేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నలుపుదనం ఉన్న చోట అప్లై చేసుకుని 5 నిమిషాల తర్వాత క్లీన్‌ చేసుకోవాలి.

పెరుగు, నిమ్మరసం : ఒక గిన్నెలో టేబుల్‌ స్పూన్‌ పెరుగు, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు పసుపు, టేబుల్‌ స్పూన్‌ శనగపిండి కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని చంకల్లో రాసుకుని 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా క్లీన్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

  • అలాగే రోజూ కొబ్బరినూనెను అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుందంటున్నారు.
  • ఇంకా.. నిమ్మ చెక్కతో డైలీ నల్ల మచ్చలు ఉన్న చోట రాయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆ సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
  • అదేవిధంగా బంగాళదుంప రసం లేదా సన్నగా కట్‌ చేసిన ఆలుగడ్డ ముక్కలతో మృదువుగా నలుపుదనం ఉన్నచోట రుద్దుకోవాలి. తర్వాత క్లీన్‌ చేసుకుంటే సరిపోతుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పెదవులు జీవం కోల్పోయాయా? - ఈ టిప్స్‌ పాటిస్తే సూపర్ లిప్స్ మీ సొంతం! - Tips for Natural Pink Lips

కనుబొమల వెంట్రుకలు రాలిపోతున్నాయా? - ఈ సమస్య నుంచి ఇలా బయటపడండి! - How To Prevent Eyebrow Hair Loss

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.