ETV Bharat / health

రోజూ ఉడికించిన గుడ్డు తింటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Eggs Benefits in telugu

Eating Boiled Eggs Everyday Benefits : గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. మరి.. మీరు ఉడకబెట్టిన కోడి గుడ్డును తింటున్నారా? దీనివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Eating Boiled Eggs Everyday Benefits
Eating Boiled Eggs Everyday Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 10:58 AM IST

Eating Boiled Eggs Everyday Benefits : శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు గుడ్డులో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే గుడ్డును సంపూర్ణ పోషకాహారమని నిపుణులు చెబుతుంటారు. కనీసం రోజుకు ఒక్క కోడిగుడ్డ అయినా తినాలని సూచిస్తుంటారు. అయితే.. డైలీ ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని తెలియజేస్తున్నారు. అదే సమయంలో కొంత మందిలో రోజూ గుడ్డు తినడం వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా కనిపిస్తుంటాయని చెబుతున్నారు. మరి ప్రతి రోజు కోడి గుడ్డును తినడం వల్ల మీ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డైలీ ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

  • ఎగ్స్‌లో విటమిన్స్‌, మినరల్స్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కండరాలను బలంగా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.
  • ఇంకా దెబ్బతిన్న కణజాలాలను సరి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • గుడ్డులో ఉండే విటమిన్‌ ఎ మన కంటి చూపును మెరుగుపరుస్తుందని తెలియజేస్తున్నారు.
  • అలాగే విటమిన్‌ డి ఎముకలను బలంగా ఉంచేలా సహాయపడుతుంది.
  • కోడి గుడ్లలో కోలిన్‌ అనే విటమిన్‌ బి సమూహం ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను కూడా పెంపొందిస్తుందని తెలియజేస్తున్నారు.
  • 2018లో Neurology జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వారానికి ( 5-7 కోడిగుడ్లను) తిన్న పురుషులలో మెదడు క్షీణత ప్రభావం 25 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం 12 సంవత్సరాలు జరిగింది. ఇందులో 11వేల మంది పురుషులు పాల్గొన్నారు.
  • ఎగ్స్‌లో తక్కువ క్యాలరీలుంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు డైలీ ఒక ఉడకబెట్టిని ఎగ్‌ను తినడం వల్ల అతిగా తినకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు. దీనివల్ల బరువు అదుపులో ఉంటుందట.
  • డైలీ బాయిల్డ్ ఎగ్‌ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.
  • వీటిని రోజూ తినడం వల్ల కడుపులో మంట కూడా తగ్గుతుందట.

రోజూ ఎగ్‌ తింటే కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ :

  • ప్రతి రోజు కోడి గుడ్డు తినడం వల్ల కొంత మందిలో అలర్జీలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై దద్దర్లు, ఎర్రగా మారడం వంటి సమస్యలున్న వారు కొన్ని రోజులు గుడ్లను తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
  • బాడీలో హై కొలెస్ట్రాల్‌ ఉన్న వారు డైలీ ఎగ్‌ను తినడం వల్ల ఇంకా కొలెస్ట్రాల్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుందట.
  • దీనివల్ల గుండె జబ్బులు కూడా వస్తాయని చెబుతున్నారు.
  • కొంత మందిలో రోజూ గుడ్డు తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా రావచ్చని నిపుణులంటున్నారు.

గమనిక : సాధారణంగా హెల్దీగా ఉండేవారు రోజుకు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. కానీ.. కొంత మందిలో డైలీ ఎగ్‌ను తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనిపిస్తాయట. మీకు ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.

క్యాన్సర్​ నుంచి కిడ్నీల ఆరోగ్యం వరకు - దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలివే!

మరమరాలు ఆఫ్ట్రాల్ అని తీసిపారేయకండి - ఇవి తిన్నారంటే..!

బాదం తినకపోతే ఓ సమస్య - అతిగా తింటే మరో ప్రాబ్లం! - రోజుకు ఎన్ని తినాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.