Curry Leaves Buttermilk Benefits For Skin : మజ్జిగ శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో కడుపునకు చల్లటి అనుభూతి కలిగేందుకు, శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేందుకు మజ్జిగ మంచి ఎంపిక. అయితే మీరు రోజూ ఆరోగ్యం బాగుండాలని తాగే మజ్జిగలో ఏయే పదార్థాలు వేసుకుంటారో తెలియదు కానీ కరివేపాకు వేసుకుంటే మాత్రం చర్మం విషయంలో మ్యాజిక్ జరుగుతుందట. అవును మీరు విన్నది నిజమే! మజ్జిగ తాగితే చర్మానికి కూడా చాలా మంచిది. అందుకే కర్రీ లీఫ్ వేసుకుంటే మరీ మంచిదట. ఇది మీ కురులకు కూడా చక్కటి ప్రయోజనాలను చేకూరుస్తుందట. అదెలా తయారు చేయాలో, దాని వల్ల చర్మానికి కలిగే లాభాలేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం.
కరివేపాకు మజ్జిగ తయారు చేసే విధానం
కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు పెరుగు లేదా యోగర్ట్
- గుప్పెడు కరివేపాకు ఆకులు
- ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి
- కొన్ని కొత్తిమీర ఆకులు
- ఒక పచ్చిమిర్చి
- చిటికెడు అల్లం
- రుచికి తగినంత ఉప్పు
తయారు చేసే విధానం
- ముందుగా కరివేపాకు, కొత్తిమీర తీసుకుని వాటిని శుభ్రంగా కడగండి. వీటిని మళ్లీ పొడి టవల్‌తో తుడిచి పక్కనబెట్టండి.
- ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పెరుగు లేదా యోగట్, కరివేపాకు, కొత్తిమీర, తరిగిన మిర్చి, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు కలిపి మిక్సీ పట్టండి. అవి మొత్తం చక్కగా కలిసి స్మూతీలా మారేదాక ఈ ప్రాసెస్ కొనసాగాలి.
- తర్వాత దాని గ్లాసులో పోసుకుని తాజా కరివేపాకు, కొత్తిమీర ఆకులను గార్నిష్‌గా చేసుకుని సర్వ్ చేసుకుంటే సరి. కరివేపాకు మజ్జిగ రెడీ ప్రయోజనాలేంటి మరి?
హైడ్రేషన్ కోసం!
అందంగా కనిపించాలన్నా, శరీరంలో అన్ని పనులు సక్రమంగా జరగాలన్నా, మనం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండక తప్పదు. మజ్జిగలో పెరుగు లేదా యోగట్ కారణంగా లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా లభిస్తుంది. ఇది చర్మాన్ని, వెంట్రుకలను ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చర్మానికి కావల్సిన తేమను అందించి మృదువుగా మారుస్తుంది.
వెంట్రుకలు పెరగడానికి!
కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ప్రొటీన్స్ గుణాలు జట్టు ఊడిపోవడాన్ని తగ్గించి, వెంట్రుకలు పెరగడానికి దోహదపడతాయి. రోజూ ఈ మజ్జిగ తీసుకోవడం వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలపడి, జుట్టు ఎదుగుదలకు సహకరిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు
కరివేపాకు, కొత్తిమీర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు ఏమీ కాకుండా సంరక్షిస్తుంటాయి.
చర్మానికి ఇరిటేషన్ లేకుండా!
పెరుగు లేదా యోగట్లో అల్లం కలుపుకుని తాగడం వల్ల చర్మానికి ఇరిటేషన్, మంట, దురద వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మంపై అలసటను తగ్గించి రిఫ్రెషింగ్, మెరిసేలా మార్చుతుంది.
అరుగుదల విషయంలోనూ!
స్కినే కేర్ బెనిఫిట్స్ అటుంచితే మజ్జిగలో ఉండే కరివేపాకు అరుగుదలను మెరుగు చేస్తుంది. పెరుగు, అల్లం, జీలకర్ర ఇవన్నీ జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తాయి. ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చర్మం, వెంట్రుకలపై కూడా మంచి ప్రభావాన్ని కలిగిస్తాయి.