coriander health benefits : ఒకే ఒక్క పదార్థం తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోతాయి. అరి చేతులు, అరికాళ్లల్లో మంటలు, తిమ్మిర్లను తగ్గించడంలో, కడుపులో మంట, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ పదార్థం మనకు దోహదపడుతుంది.
మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పదార్థం మరేమిటో కాదు రోజువారీ వంటల్లో, మరీ ముఖ్యంగా మాంసాహార వంటకాల్లో విరివిగా ఉపయోగించే ధనియాలు. ఇవి మనందరికీ సుపరిచితమే. ధనియాల పొడిని మనం వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాం. ధనియాల పొడిని వంటల్లో వాడడం వల్ల.. రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఊహించలేని మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
ధనియాలను సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ధనియాలను ఎలా ఉపయోగించాలి? వాటి ద్వారా మనం పొందే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. ధనియాలతో కషాయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
మధుమేహాన్ని తరిమికొట్టే మందులివే!- ఉదయాన్నే తీసుకుంటే రోజంతా ఉత్సాహమే - diabetes CONTROL food
ధనియాల కషాయం తయారీ ఇలా..
- ముందుగా ఒక గిన్నెలో గ్లాస్ నీటిని పోసుకోవాలి
- నీటిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
- ఉదయాన్నే 5 నిమిషాల పాటు పొయ్యిపై వేడి చేసుకోవాలి
- గోరువెచ్చగా నీటిని వడకట్టి టీ తాగినట్టు తాగాలి.
ధనియాల కషాయం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..
- ధనియాల కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
- నరాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది
- ధనియాల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.
- ధనియాల కషాయం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది.
- ఎముకలు ధృఢంగా తయారవుతాయి.
- కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
- రక్తహీనత సమస్య తొలగిపోతుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ఈ కషాయం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
- శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
- కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు ధనియాల కషాయం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ధనియాల కషాయాన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
అధిక వ్యాయామంతో గుండెపోటు!- ఈ లక్షణాలు కనిపిస్తే డేంజరే - HEART ATTACK SYMPTOMS
కొత్తిమీర ఆకులతోనూ అనేక ప్రయోజనాలు...
వంట పూర్తయ్యాక అలంకరణ కోసం ఉపయోగించే కొత్తి మీర సైతం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కొత్తిమీరలో విటమిన్ ఏ, సితో పాటు క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. అనేక ఖనిజ లవణాలకు గని. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. స్మోకింగ్ చేసేవారికి ఎంతో మేలు చేస్తుంది. రక్తనాలాల్లో పేరుకుపోయిన కొవ్వులను శుద్ధి చేస్తుంది. అజీర్తి, గ్యాస్, శరీరంలో వేడిని తగ్గించడం, ఆకలి తగ్గించడం, మలబద్ధకాన్ని తగ్గించడంలో ది బెస్ట్ మెడిసిన్గా కొత్తిమీర ఉపయోగపడుతుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డయాబెటీస్ రోగులు డ్రై ఫ్రూట్స్ తింటున్నారా? - ఆ రంగు పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే! - healthy food for diabetes