ETV Bharat / health

వంటింట్లో ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పులివే! - Cooking Mistakes

Common Cooking Mistakes : రోజూ మనం కిచెన్‌లో చేసే పొరపాట్ల గురించి చెప్పుకోవడానికి చాలా సిల్లీగా అనిపిస్తాయి. కానీ ఆ అలవాట్లే వంటను కలుషితం చేసి ఆనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయని నిపుణులు అంటున్నారు. అందుకే వాటిని మార్చుకోమని సూచిస్తుంటారు. మరి, మనకు తెలియకుండానే వంటింట్లో చేసే పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిచేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 4:00 AM IST

Common Cooking Mistakes
Common Cooking Mistakes (Getty Images)

Common Cooking Mistakes : మారుతున్న జీవనశైలికి తగినట్లుగా వంట చేయడం, తినడం, ఆహార పదార్థాలను నిల్వ చేయడం వంటి విషయాల్లో మనం చేస్తున్నవన్నీ సరైనవే అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రస్తుత జీవనశైలికి తగినట్లుగా మన వంటగదిలోని పదార్థాలు, వండే విధానాల్లో మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? అంటే చాలానే ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

చికెన్ లేదా ఫిష్
బయట నుంచి తీసుకురాగానే మాంసాహారాలను మనం ఫ్రిజ్​లో పెట్టేస్తాం. తరువాత వంట చేస్తున్నప్పుడు బయటకు తీసి నేరుగా వండేస్తుంటాం. ఇలా చేయడం చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. మాంసాన్ని ఫ్రిజ్ నుంచి నేరుగా స్టవ్ మీద గిన్నెలో వేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అంటున్నారు. వండటానికి కనీసం గంట లేదా అరగంట ముందైనా మాంసాన్ని బయటపెట్టడం అలవాటు చేసుకోవాలి.

ఆలుగడ్డ, ఉల్లిగడ్డ
ఎన్నో ఏళ్లుగా చాలా మంది చేస్తున్న పొరబాటు ఏంటంటే బంగాళాదుంపలను, ఉల్లిపాయలను ఒకే చోట ఉంచడం. ఇవి రెండూ గ్యాస్ ఉత్పత్తి చేసే పదార్థాలే. ఇవి ఒకదాన్ని ఒకటి పాడు చేసుకునేలా చేస్తాయి. అందుకే ఈ రెండింటినీ వేరు వేరుగా, చల్లటి, పొడి ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.

అల్లం తొక్క తీయడంలో
అల్లం తొక్కను చాకుతో తీయడం చాలా మందికి అలవాటు. ఇలా చేయడం వల్ల మీరు తొక్కతో పాటుగా చాలా అల్లాన్ని కోల్పోతారట. అలా కాకుండా టీస్పూన్​తో అల్లం పొట్టును తీయడం అలవాటు చేసుకున్నారంటే చాలా సులభంగా తొక్క రావడమే కాకుండా ఎక్కువ అల్లం వ్యర్థం కాకుండా ఉంటుంది.

తేనె తీయడంలో
డబ్బాలోంచి తేనె బయటకు తీసిన ప్రతిసారీ మన గ్లాసులోకి లేదా గిన్నెలోకి సగం తేనె మాత్రమే వస్తుంది. మిగిలింది స్పూనుకే అతుక్కుని ఉంటుంది. ఈసారి డబ్బాలోంచి తేనె తీసేటప్పుడు స్పూన్​ను వేడి నీటిలో ముంచి ట్రై చేయండి.

ఫ్రిజ్​లో టమాటాలు
వారానికి సరిపడా కూరగాయలన్నింటిని ఒకేసారి తెచ్చుకుని ఫ్రిజ్​లో పెట్టుకుంటున్నాం. అయితే ఫ్రిజ్​లో టమాటాలు పెట్టడం మంచి అలవాటు కాదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల టమాటాలు రుచిని, పటుత్వాన్ని కోల్పోయతాయని అంటున్నారు.

చాపింగ్ ప్యాడ్ విషయంలో
సాధారణంగా కూరగాయలు కట్ చేసిన వెంటనే చాపింగ్ ప్యాడ్​ను సింక్​లో వేసి వంట అయ్యాక అంట్లు తోముతున్నప్పడు దాన్ని శుభ్రం చేస్తుంటాం. ఇలా చాపింగ్ ప్యాడ్​ను నానబెట్టడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల చెక్క తేమను పీల్చుకుని తర్వగా పాడైపోవడం, పొట్టు పొట్టుగా లేవడం జరుగుతుంది.

బంగాళాదుంపలను ఉడికించడంలో
బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు చాలా మంది మరుగుతున్న నీటిలో ఆలూని వేస్తుంటారు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదట. ఇలా చేయడం వల్ల దుంపల్లోపలికి వేడి చేరే లోపే బయట ఉడికిపోతాయట. అలా కాకుండా చల్లటి నీటిలో కాస్త ఉప్పు వేసి దాంట్లో ఆలూ వేసి ఉడికించడం వల్ల దుంపలు త్వరగా, పూర్తిగా ఉడుకుతాయని నిపుణలు చెబుతున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టు సమస్యలకు గుడ్డు- ఇలా అప్లై చేస్తే హెయిర్ ఫాల్ బంద్ గ్యారెంటీ! - Egg Hair Mask

వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే ప్రమాదం! ఫుల్​ లిస్ట్​ ఇదే! - Vegetables To Avoid During Monsoon

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.