ETV Bharat / health

ఎంత ట్రై చేసినా స్మోక్ చేయడం మానలేకపోతున్నారా?- ఈ టిప్స్​ ట్రై చేస్తే అస్సలు తాగరు! - Quit Smoking Tips

Best Tips to Quit Smoking : "ధూమపానం​ ఆరోగ్యానికి హానికరం" అని తెలిసినప్పటికీ చాలా మంది దాన్ని ఓ వ్యసనంలా మార్చుకుంటున్నారు. తీరా అనారోగ్య సమస్యలు తలెత్తాక సిగరెట్లు తాగడం మానలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తే ఈజీగా స్మోక్ చేసే అలవాటును మానుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Quit Smoking
Smoking
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 4:49 PM IST

Simple Tips to Quit Smoking Habit : స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలా మంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. ఫ్యాషన్, స్టైల్, రిలాక్సేషన్, సరదా కోసం మొదలైన అలవాటు ఓ వ్యసనంగా మారి ఎంతో మంది ప్రాణాలను తీస్తోంది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి పొగాకు ఉత్పత్తులు తాగడం వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై ప్రభావం పడుతుంది. దాంతో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఉదరకోశ క్యాన్సర్‌ వంటి తీవ్రమైన అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది పొగ తాగడం మానేయాలనుకుంటారు. కానీ, ఆ వ్యసనం నుంచి బయటపడలేరు. ముఖ్యంగా యువత స్మోకింగ్‌(Smoking)కు అడిక్ట్ అవుతూ దాని నుంచి బయటపడలేక నరకయాతన అనుభవిస్తుంటారు. అలాంటి వారు ఈ టిప్స్​ ఫాలో అయ్యారంటే చాలు.. మళ్లీ స్మోకింగ్ జోలికి పొమ్మన్న పోరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

క్రమంగా మానుకోవడం : ఎవరికైనా కొద్ది రోజుల్లోనే పొగ తాగడం మానేయడం అసాధ్యం. కాబట్టి క్రమంగా ఈ అలవాటును మానుకోవాలి. మీరు స్మోకింగ్ అలవాటును దూరం చేసుకోవాలంటే ముందుగా దాని ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవాలి. హెల్త్ కేర్ కంపెనీ మయో క్లినిక్ ప్రకారం.. మీరు మీ స్మోకింగ్ సెషన్ల మధ్య గ్యాప్​ను పెంచడం ద్వారా దీనిని ప్రారంభించండి. ఒక వ్యక్తికి ప్రతి గంటకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకుంటే ఇకపై అలా కాకుండా ఆ సమయాన్ని 5 నిమిషాలకు పెంచండి. అంటే ఉదాహరణకు మీరు గంట క్రితం సిగరేట్ తాగితే మరో గంట కాగానే స్మోక్ చేయకుండా ఐదు నిమిషాలు వెయిట్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా స్మోకింగ్ సెషన్ల మధ్య విరామాన్ని పెంచుకుంటూ పోతే ఈ వ్యసనాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. ఈ స్మాల్ ఛేంజ్ బిగ్ రిజల్ట్​ను అందిస్తుందంటున్నారు నిపుణులు.

ఓరల్ సబ్​స్టిట్యూట్స్ : పొగ తాగే అలవాటుకి దూరమవ్వాలంటే మీరు చేయాల్సిన మరో పని ఓరల్ సబ్​స్టిట్యూట్స్​ను ఎంచుకోవడం. అంటే మీకు పొగ తాగాలని అనిపించినప్పుడల్లా సిగరెట్​కు బదులుగా ఏదైనా నమలడానికి ట్రై చేయాలి. ఇందుకోసం షుగర్​లెస్ గమ్ లేదా హార్డ్ క్యాండీ వంటివి తింటూ మీ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేయాలి. రోజూ ఆరోగ్యానికి హాని చేయని ఇలాంటి వాటిని తినడం వల్ల స్మోక్ చేయాలనే కోరికలు తగ్గుతాయి. దీంతో మీరు ఈజీగా ఈ వ్యసనం బయటపడతారు. 2018లో జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పొగ తాగే అలవాటు ఉన్న వారు చూయింగ్ గమ్ తిన్న తర్వాత స్మోక్ చేయాలనే కోరిక తగ్గిందని, పొగ తాగడానికి ఎక్కువ సమయం పట్టిందని నివేదించారు.

'స్మోకింగ్' వ్యసనానికి వంకాయతో చెక్​.. రోజూ తీసుకుంటే..

నట్స్, క్యారెట్లు తినడం : స్మోకింగ్​ అలవాటు దూరంగా చేసుకోవాలంటే హెల్దీ డైట్​పై దృష్టి పెట్టాలి. అందులో భాగంగా స్మోకింగ్ సేషన్ల మధ్య కొన్ని ఆహారాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రోజూ నట్స్, క్యారెట్లు వంటివి తినాలి. మధ్యమధ్యలో ఇవి తింటుంటే స్మోకింగ్ చేయాలనిపించదు. ప్రధానంగా పచ్చి క్యారెట్లు తినడం ద్వారా నికోటిన్ కోరికలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

రిలాక్సేషన్ టెక్నిక్ : ఒక వ్యక్తి ధూమపానం చేయడానికి ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. దీని కారణంగా ఈ వ్యసనం మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి ముందు స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇందుకోసం డీప్ బ్రీతింగ్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ వ్యాయామాలు వంటివి సాధన చేయాలి. వీటితో పాటు యోగా, ధ్యానం కూడా ఒత్తిడిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి స్మోకింగ్ చేయాలనే కోరిక తగ్గుతుంది. తద్వారా ఈ పొగతాగడం మానేయడం చాలా సులభం అవుతుందంటున్నారు నిపుణులు.

'ఆనందాన్ని ఎవరు కోరుకోరు'.. ఈ సిగరెట్​​ యాడ్​ పాప అందాన్ని ఇప్పుడు చూస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.