Best Morning Drinks for Diabetics : నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటిస్తో ఇబ్బందిపడుతున్నారు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే.. ఒక్కసారి ఎటాక్ అయిందంటే లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. అయితే, ఈ వ్యాధి వల్ల కలిగే సమస్యలు తీవ్రతరం కాకుండా ఉండాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే మధుమేహ(Diabetes) వ్యాధిగ్రస్థులు షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండేందుకు రోజూ మందులు వాడుతూ.. కొన్ని ఆహారపు అలవాట్లను ఫాలో అవుతుంటారు. అయితే, అవేకాకుండా.. డైలీ పరగడుపున ఈ డ్రింక్స్ తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంచడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ, ఆ డ్రింక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గోరు వెచ్చని నిమ్మకాయ నీరు : పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్‌లో నిమ్మరసం కలిపి తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఖాళీ కడుపున లెమన్ వాటర్ తీసుకోవడం శరీరంలోని వ్యర్థాలను తొలగించడంతో పాటు బరువు కంట్రోల్లో ఉండేందుకు చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని లక్నోలోని రీజెన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్. డి.పి.సింగ్ సూచిస్తున్నారు.
దాల్చిన చెక్క టీ : దాల్చినచెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. కాబట్టి, డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మార్నింగ్ ఈ టీ తయారుచేసుకొని తీసుకోవడం వల్ల.. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని అంటున్నారు.
కాకరకాయ రసం : ఇందులో ఉన్న సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మార్నింగ్ దీన్ని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
2013లో 'జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్నవారు రోజు ఉదయం కాకరకాయ రసం తాగడం వల్ల వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని టెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్. మహ్మద్ హసన్ హోసైని పాల్గొన్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు డైలీ కాకరకాయ రసం తాగడం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.
షుగర్ ఉన్నవారు ఈ పండ్లు తింటే - ఆరోగ్యానికి మంచిది! - Diabetes Patients Eat Fruits
మెంతి వాటర్ : మెంతులలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి మార్నింగ్ పరగడుపున ఆ వాటర్ తాగాలని సూచిస్తున్నారు.
ఉసిరి రసం : విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి.. రక్తంలో చక్కెర్ స్థాయిలను కంట్రోల్లో ఉంచడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
కలబంద రసం : చర్మం సంరక్షణ, గాయాలు మానడంలో సహాయపడే అలోవెరా.. హైపోగ్లైసీమిక్ ప్రభావాలను కూడా కలిగి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులు పరగడుపున కొద్ది మొత్తంలో కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల అది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
తులసి టీ : తులసి ఆకులు యాంటీ-డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు మార్నింగ్ పరగడుపున తులసి టీ తాగడం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్ వ్యాధికి రోజూ మందులు వాడొద్దంటే - ఇలా చేస్తే సరిపోతుంది! - How To Control Diabetes