ETV Bharat / health

మీ ఒంట్లో సరిపడా రక్తం లేదని బాధపడుతున్నారా? - ఈ ఫుడ్​ తింటే మంచిదంటున్న ఆయుర్వేద నిపుణులు! - Best Food to Increase Hemoglobin - BEST FOOD TO INCREASE HEMOGLOBIN

Anemia: మీరు రక్తహీనతతో బాధపడుతున్నారా? రక్తం పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా?. డోంట్​ వర్రీ ఆయుర్వేదం ప్రకారం ఒక్కసారి ఈ ఔషధాన్ని ప్రిపేర్​ చేసుకుని తింటే రక్తం వేగంగా పెరుగుతుందని అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

HOW TO REDUCE ANEMIA PROBLEM
Best Food to Increase Hemoglobin (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Aug 26, 2024, 6:22 PM IST

Best Food to Increase Hemoglobin as per Ayurveda: శరీరంలో హెమోగ్లోబిన్ శాతం తగినంత ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం. లేదంటే రక్తహీనత సమస్య తలెత్తుతుంది. దీనినే వైద్యపరిభాషలో అనీమియా అంటారు. చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అలాగే మహిళల్లో ప్రతి నెలా పీరియడ్స్​ సమయంలో బ్లీడింగ్‌ రూపంలో ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంది. ఇదీ రక్తహీనతకు దారితీస్తుంది. అయితే శరీరంలో రక్తాన్ని పెంచుకోవడానికి మందులు వాడాల్సిన అవసరం లేదని.. ఆయుర్వేదం ప్రకారం ఈ ఔషధాన్ని రెడీ చేసుకుంటే చాలంటున్నారు. ఈ ఔషధం సహజ సిద్ధంగానే బ్లడ్​ పెరిగేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర గాయత్రీ దేవి అంటున్నారు. మరి ఆ ఔషధం ఏంటి? దానిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • ఉసిరి రసం లేదా ఉసిరి కషాయం - 1 లీటర్​
  • పిప్పళ్ల పొడి - 125 గ్రాములు
  • తేనె - 120 ml
  • పంచదార లేదా పటిక - 125 గ్రాములు
  • మట్టి కుండ - 1

తయారీ విధానం:

  • ముందుగా ఉసిరి రసం తీసుకోవాలి. ఉసిరికాయలు తాజావి దొరికితే వాటి నుంచి రసం చేసుకోవచ్చు. లేదంటే ఉసిరి కషాయాన్ని ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ మీద గిన్నె పెట్టి అందులో 1 కేజీ ఎండిన ఉసిరికాయ ముక్కలను వేసి నాలుగు లీటర్ల నీరు పోసి మంటను సిమ్​లో పెట్టి లీటర్​ నీరు అయ్యేవరకు మరిగించుకోవాలి. అలా మరిగిన దాన్ని వడకట్టి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పిప్పళ్ల పొడి రెడీ చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి పిప్పళ్లు వేసి వేయించుకుని చల్లారిన మెత్తని పొడిలా చేసుకోవాలి. అలా చేసుకున్న పొడిని 125 గ్రాములు తీసుకోవాలి.
  • ఇప్పుడు కుండ తీసుకుని అందులో ఉసిరి రసం లేదా కషాయాన్ని పోసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి పిప్పళ్లు చూర్ణం వేసి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత పంచదార లేదా పటిక బెల్లం వేసుకుని కలుపుకోవాలి.
  • అనంతరం తేనె వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఆ కుండపై ఓ వస్త్రం కప్పి దాన్ని తాడుతో కట్టుకుని సీల్​ చేసుకోవాలి.
  • ఇలా చేసుకున్న కుండను 15 రోజుల పాటు కదపకుండా పక్కకు పెట్టుకోవాలి. అంతే ఔషధం రెడీ అయిపోతుంది.

మన శరీరంలో ఐరన్​ లోపం ఉంటే - ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

ఎలా తీసుకోవాలంటే:

  • 15 రోజుల తర్వాత కుండలో ఉన్న మిశ్రమాన్ని ఓ సీసాలో స్టోర్​ చేసుకోవాలి.
  • ఇక ఆ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం పరగడపున రెండు పెద్ద చెంచాల మేర తినాలని చెబుతున్నారు.
  • ఇలా చేయడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుందని అంటున్నారు.

ప్రయోజనాలు చూస్తే:

ఉసిరి: ఉసిరిలో విటమిన్​ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని.. ఇవి రక్తహీనతను నివారించి, రక్తం తయారీకి ఉపయోగపడతాయని అంటున్నారు.

పిప్పళ్లు: పిప్పళ్లలో కూడా రక్తవృద్ధిని పెంచే గుణం ఉందని అంటున్నారు. అలాగే కడుపులో నులిపురుగులను కూడా నశింపజేసే గుణం వీటికి ఉందని అంటున్నారు. జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుందని సూచిస్తున్నారు.

తేనె: సహజ సిద్ధంగా లభింతే తేనెలో పలు పోషకాలు ఉంటాయని.. ఇవి రక్తహీనతను తగ్గించి సహజంగా రక్తం పెరిగేలా చేస్తుందని వివరిస్తున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎండు ద్రాక్షతో రక్తహీనత మాయం.. ఎప్పుడు? ఎలా? తినాలో తెలుసా?

ఈ లక్షణాలు ఉన్నాయా? రక్తహీనత కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.