ETV Bharat / entertainment

'ఆ సమయంలో చాందినీని చూసి భయపడ్డా - ఇకపై అటువంటి సాహసాలు చేయను'

Vishwak Sen Gaami Movie : యంగ్ హీరో విశ్వక్ సేన్ త్వరలో 'గామి' ఓ అడ్వెంచరస్​ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన విశ్వక్​, సినిమా గురించి పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. ఆ విశేషాలు తన మాటల్లోనే

Vishwak Sen Gaami Movie
Vishwak Sen Gaami Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 6:50 AM IST

Vishwak Sen Gaami Movie : ఓ డైరెక్టర్​గా, ఓ హీరోగా తనదైన స్టైల్​లో టాలీవుడ్​లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మాస్​ కా దాస్ విశ్వక్​సేన్. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో యూనిక్ కాన్సెప్ట్​ ఉండేలా చూసుకుంటున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు 'గామి' అనే ఓ అడ్వెంచరస్ మూవీతో ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యారు.

​ఇటీవలే విడుదలైన ట్రైలర్​ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు విశ్వక్​. సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు.

  • ఐదేళ్ల క్రితమే ఓకే చెప్పిన సినిమా. ఇది పూర్తిగా డైరెక్టర్స్​ మూవీ. ఇందులో మా మేకర్స్ టీమ్ సమష్టి కృషి 10 శాతం అయితే, డైరెక్టర్​ కష్టమే 90 శాతం ఉంది. ఈ సినిమా కోసం నేను రెమ్యూనరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేశాను.
  • ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇన్నేళ్లు పట్టినప్పటికీ సినిమా పాతదైపోయిందన్న ఫీల్ ఏమాత్రం కలగదు. ఇది ఇంకో పదేళ్ల తర్వాత రిలీజైనా సరే కొత్తదిలానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్​ అంత కొత్తగా ఉంటుంది. కచ్చితంగా ఇలాంటి పాయింట్‌ ఇంకెవరూ రాయలేరు. ట్రైలర్‌లో చూపించిన విధంగానే ఈ మూవీ ఓ ఆంథాలజీలాగే ఉంటుంది. అయితే ఇందులోని కథలన్నీ ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్‌ అవుతాయన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది క్రిస్టోఫర్ నోలన్‌ సినిమా స్టైల్​ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది.
  • అలాగని ఈ స్టోరీ మరీ బుర్రకు పని చెప్పే అంత కష్టంగా ఉండదు. మన దేశంలో జరిగే కథలే కాబట్టి ప్రేక్షకులకు తేలికగా అర్థమైపోతుంది. దీంట్లో నేను మానవ స్పర్శ అనుభవించలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడే అఘోరాగా కనిపిస్తాను. నా పాత్రకు డైలాగ్స్ పెద్దగా ఉండవు. యాక్షన్‌, ఎమోషన్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్​ ఉంటుంది.
  • ఈ సినిమా కోసం మేమంతా హిమాలయాల్లోని ఓ గడ్డ కట్టిన నదిపై షూటింగ్ చేశాం. అది నాకు ఛాలెంజింగ్​గా అనిపించింది. ఎందుకంటే అది పైకి గడ్డ కట్టి ఉన్నట్లు కనిపించినప్పటికీ లోపల మాత్రం నది చాలా వేగంగా పరుగులు తీస్తుంటుంది. షూటింగ్ టైమ్​లో అనుకోకుండా ఆ నదిపై ఉన్న మంచు ఫలకం పగిలి ఆ నీళ్లలోకి పడ్డామంటే ఇక మళ్లీ 40 కిలో మీటర్ల తర్వాతనే మనం బయటకు తేలుతాం. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ మేమెంతో ధైర్యంగా షూటింగ్ చేశాం.
  • ఓ రోజు హీరోయిన్ చాందిని రోల్​కి సంబంధించిన షూట్‌ జరుగుతున్నప్పుడు తను నించున్న దగ్గర మంచు పగిలిపోతున్న శబ్దం వినిపించింది. ఇక అంతే వెంటనే తన దగ్గరున్న 12 కేజీల బరువుతో ఉన్న బ్యాగ్‌ను దూరంగా విసిరేసి బయటకు పరిగెత్తుకొచ్చింది. అప్పట్లో సినిమా కోసం ఏమైనా చేయాలని అనుకునే వాణ్ని. అది జరిగాక నాకు అనిపించింది ఇంకో సినిమా చేయాలంటే ముందు మనం ఉండాలి కదా అని (నవ్వుతూ). కచ్చితంగా ఇప్పుడైతే నేనిలాంటి సాహసాలు చేయాలని అనుకోవడం లేదు.
  • ఇక 'గామి' తర్వాత నా నుంచి 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి', 'మెకానిక్‌ రాజు', 'లైలా' సినిమాలు రానున్నాయి. అన్నీ వేటికవే డిఫరెంట్​గా ఉంటాయి. 'లైలా' షూటింగ్ మే నెల నుంచి మొదలవుతుంది. ఆ సినిమా సెకెండాఫ్​ మెత్తం నేను ఓ అమ్మాయిగా కనిపిస్తాను.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

గామి ట్రైలర్ ఔట్- విశ్వక్​సేన్ న్యూ గెటప్ అదుర్స్​

మైనస్ 40 డిగ్రీల చలిలో షూటింగ్​ - విశ్వక్​ను చూసి వాళ్లు అలా చేశారట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.