ETV Bharat / entertainment

'మహారాజా' రెస్పాన్స్ అదుర్స్- 24 గంటల్లోనే 2 లక్షల టికెట్లు సోల్డ్ - Maharaja Movie Tickets - MAHARAJA MOVIE TICKETS

Maharaja Movie Tickets: స్టార్ హీరో విజయ్ సేతుపతి- నిథిలన్‌ స్వామినాథన్‌ కాంబోలో తెరకెక్కిన 'మహరాజా' మూవీ సూపర్ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే టికెట్ల అమ్మకాలు కూడా జోరుగా పెరిగాయి.

Maharaja Movie Tickets
Maharaja Movie Tickets (Soure: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 12:04 PM IST

Updated : Jun 16, 2024, 12:19 PM IST

Maharaja Movie Tickets: తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'మహరాజా' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డైరెక్టర్ నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న రిలీజై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో వీకెండ్​లో థియేటర్లలో హౌస్​ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది.

ఈ సినిమాకు తెలుగులోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్ రోజు కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. గత 24 గంటల్లోనే దాదాపు 2 లక్షలు అమ్ముడయ్యాయి. దీంతో ప్రముఖ మూవీటికెట్ బుకింగ్ వెబ్​సైట్​లో 'మహారాజా' ట్రెండింగ్​లోకి దూసుకొచ్చింది. లాంగ్ వీకెెండ్​లో టికెట్ల అమ్మకాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

వసూళ్లలో జోరు: ఓపెనింగ్ రోజే సినిమా బ్లాక్​బస్టర్ టాక్ రావడం, వీకెండ్ కావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఒక్కసారిగా కలెక్షన్లు కూడా ఊపందుకున్నాయి. డే-1 ఇండియావైడ్​గా అన్ని భాషల్లో కలిపి రూ.4.7 కోట్లు నెట్ సాధించగా, డే- 2 రూ. 7.25కోట్లు వసూల్ చేసింది. మరో రెండు రోజులు కూడా హాలీడేస్ కావడం వల్ల కలెక్షన్లు ఈజీగా పెరిగే ఛాన్స్ ఉంది.

డైరెక్టర్ నిథిలన్‌ ఈ సినిమాను థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్​ జానర్​లో తెరకెక్కించారు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చిత్రీకరించారు. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అన్ని వర్గాల ఆడియెన్స్​ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక హీరో విజయ్​కు ఇది 50వ సినిమా. ఇందులో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆయన నటనే సినిమాకు ప్లస్ పాయింట్ అని అంటున్నారు.

కాగా, ఆయన నటించిన ఈ 50వ సినిమా ట్రేడ్‌ మార్క్‌గా నిలిచిపోనుందని హీరోయిన్ కీర్తీ సురేశ్ రీసెంట్​గా ప్రశంసించారు. ఇక సినిమాలో విజయ్​తోపాటు అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, అభిరామి, నటరాజ్‌, భారతీరాజా, నటరాజ్, అరుళ్ దాస్, బాయ్స్ మణికందన్, వినోద్ సాగర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సుదాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి నిర్మించగా, అజనీశ్ లోక్​నాథ్ సంగీతం అందించారు.

నయనతార భర్తతో గొడవ - స్పందించిన విజయ్‌ సేతుపతి - Vijay Sethupathi Maharaja

'స్టోరీ వినగానే 50వ సినిమాగా ప్రకటించాను - ఇకపై అదే నా ఫ్యూచర్ ప్లాన్' - Vijay Sethupati Maharaja Movie

Last Updated : Jun 16, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.