ETV Bharat / entertainment

ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలా? - OTTలో ఈ 7 సినిమాలు బెస్ట్ ఆప్షన్ ! - Top Family Movies In OTT

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 6:52 PM IST

Top Family Movies In OTT : ఓటీటీ క్రేజ్ పెరిగాక అందులో సినిమాలు, సిరీస్ లు చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సదరు ప్లాట్ ఫామ్ లు కూడా అన్ని రకాల జానర్ సినిమాలను స్ట్రీమింగ్ కు వదులుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడదగ్గ 7 సినిమాలు ఉన్నాయి. అవేంటి? ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Top Family Movies In OTT
Top Family Movies In OTT (Getty Images)

Top Family Movies In OTT : ఒకప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయిదంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి చూడాల్సి వచ్చేది. అయిన ప్రస్తుత రోజుల్లో ఇంటిల్లపాది ఇంట్లోనే కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీల పుణ్యమా అని అంతలా పరిస్థితులు మారిపోయాయి. డబ్బింగ్ మూవీస్, ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్ అన్నీ ఒక్క రిమోట్ దూరంలోకి ప్రత్యక్షమవుతున్నాయి.

ఫ్యామిలీతో కలిసి కూర్చొన్నప్పుడు ఏ ప్లాట్‌ ఫామ్ లో ఏ సినిమా ఉందో అర్థంకాక అన్నింటిని వెతుక్కుంటూ కూర్చోవాలి. మీకు ఆ శ్రమ లేకుండా ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో, ఫ్యామిలీతో కలిసి హాయిగా వీక్షించే 7 తమిళ సినిమాలను మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటంటే?

పెరన్బు (2018)
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'పెరన్బు'. రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ మూవీలో అంజలి, సాధన, అమీర్, లిజ్జీ ఆంటోని వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. పక్షవాతంతో బాధపడుతున్న కుమార్తెను చూసుకునేందుకు భార్యను వదిలేస్తాడు ఓ తండ్రి. ఆ సమయంలో ఆయన సమాజంలో ఎదుర్కొన్న సవాళ్లు, తండ్రికూతురు మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఈ సినిమాను ఇంటిల్లపాది వీక్షించవచ్చు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్​ వేదికగా ఈ సూపర్ హిట్ ఫ్యామిలీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

వీట్​ల విశేషం (2022)
తనకు తమ్ముడు పుడుతున్నాడని తెలుసుకున్న పాతికేళ్ల యువకుడి కష్టాలను వినోదాత్మకంగా చూపించిన చిత్రం 'బధాయీ హో'. అదే చిత్రాన్ని ఆర్జే బాలాజీ కథానాయకుడిగా తమిళంలో 'వీట్​ల విశేషం' పేరుతో రీమేక్‌ చేశారు. ఎన్‌.జె శర్వణన్‌ తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఈ మూవీలో ఆర్జే బాలాజీ, సత్యరాజ్, ఊర్వశి, అపర్ణ బాలమురళి తదితరలు నటించారు. జీ5లో ఈ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ అవుతోంది.

శైవం (2014)
ఈ మూవీలో ఉమ్మడి కుటుంబం ప్రాధాన్యం, అందులో ఉన్న భావోద్వేగాలను చక్కగా చూపించారు దర్శకుడు. ఈ మూవీలో నాజర్, సారా అర్జున్, లుత్‌ ఫుదీన్ బాషా, త్వరా దేశాయ్, సురేశ్ తదితరులు నటించారు. డిస్నీ+ హాట్ స్టార్​ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

36 వాయధినిలే (2015)
ఈ మూవీలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించారు. ఆమె ఇందులో సాధారణ గృహిణిగా కనిపించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన జ్యోతిక రాష్ట్రపతిని కలవడం, అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు సినిమాను మలుపు తిప్పుతాయి. ఈ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇందులో జ్యోతిక, రెహమాన్, అభిరామి, నాజర్, సిద్ధార్థ బసు, అమృత అనిల్, దిల్లీ గణేశ్ నటించారు. ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

డాడా (DADA) (2023)
డాడా సినిమాలో టైటిల్ పాత్ర నటుడు కెవిన్ నటించారు. అనుకోకుండా అతడి ప్రేయసి గర్భవతి అవుతుంది. ఆ తర్వాత వారి తల్లిదండ్రులు వీరిని ఇంటి నుంచి పంపేస్తారు. ఆ తర్వాత బతుకుపోరాటంలో వారు పడిన కష్టాలను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. కాలక్రమేణా వారిద్దరి మధ్య పెరిగిన దూరం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో కెవిన్, అపర్ణా దాస్, మాస్టర్ ఇలాన్ అర్జునన్, బేబీ నాలన్ ప్రేమ్‌కు మార్, కె. భాగ్యరాజ్, ఐశ్వర్య భాస్కరన్, వీటీవీ గణేశ్, ప్రదీప్ ఆంటోని నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ధర్మ దురై (2016)
విజయ్ సేతుపతి, మిల్క్ బ్యూటీ తమన్నా, ఐశ్వర్య రాజేశ్, రాధికా శరత్‌ కుమార్ నటులుగా తెరకెక్కిన చిత్రం ధర్మ దురై. తాగుబోతుగా ఉన్న హీరో కొన్ని కారణాల వల్ల మారుతాడు. ఇదే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

అభియుమ్ నానుమ్ (2008)
కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చిత్రం అభియుమ్ నానుమ్. కుమార్తె, తండ్రి మధ్య ప్రేమను దర్శకుడు ఇందులో చక్కగా చూపించారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, త్రిష, ఐశ్వర్య, గణేశ్ వెంకట్రామ్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. 'ఆకాశమంత' పేరుతో ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

రూ.750 జీతానికి ఫ్యాక్టరీలో పని- కట్ చేస్తే స్టార్ హీరోగా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్! - Star Hero Biography

2024 నేషనల్ అవార్డ్​ ఫిలిమ్స్​ - ఇవి ఏ OTTలో ఉన్నాయంటే? - 2024 National Award Films OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.