ETV Bharat / entertainment

ముంబయిలో మకాం - ఆ సినిమాలన్నింటికీ ఒకే కేరాఫ్ అడ్రెస్ - Tollywood Movies on mumbai

Tollywood Movies On Mumbai Backdrop :ప్రస్తుతం పాన్ ఇండియా మేనియా నడుస్తున్న తరుణంలో మేకర్స్ కూడా తమ సినిమాలను మరింత కొత్తగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఒకానొక కాలంలో పాపులరైన ముంబయి బ్యాక్​డ్రాప్ మూవీస్ ఇప్పుడు మరోసారి ట్రెండ్​లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముంబయిలో రూపుదిద్దుకుంటున్న సిినిమాలు ఏవంటే ?

Tollywood Movies On Mumbai Backdrop
Tollywood Movies On Mumbai Backdrop
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 7:32 AM IST

Updated : Feb 17, 2024, 10:46 AM IST

Tollywood Movies On Mumbai Backdrop : ముంబయి బ్యాక్​డ్రాప్​లో సినిమాలు తీయడం అనేది మన టాలీవుడ్​కు కొత్తేమీ కాదు. రొటీన్​గా లోకల్ బ్యాక్ డ్రాప్​ను ఎంచుకునే మన డైరెక్టర్లు అప్పుడప్పుడు కొత్తదనం కోసం ముంబయి లేదా కోల్​కతా పరిశరాల్లో సినిమాలు తీస్తుండటం మనం చూశాం. అప్పట్లో వచ్చిన 'బొంబాయి ప్రియుడు' నుంచి ఇటీవలే వచ్చిన సాహో వరకూ అన్ని ముంబుయి బ్యాక్​డ్రాప్​లో వచ్చినవే. ఇప్పుడు మరోసారి ఈ ట్రెండ్ తెరపైకి వచ్చింది. ఫారిన్ ట్రిప్​లు వేస్ మన డైరెక్టర్లు మళ్లీ ముంబయి బాట పట్టి సరికొత్త సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. రామ్- పూరి 'డబుల్ ఇస్మార్ట్', శేఖర్ కమ్ముల - ధనుశ్ మూవీ(ధారావి - రూమర్డ్​ టైటిల్​), దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్' ఇలా పలు సినిమాలు తమ చిత్రీకరణను ముంబయిలో జరపుకుంటున్నాయి.

గతంలోనూ ఈ ట్రెండ్ తెగ పాపులరైంది. టైటిల్​లోనే ఏకంగా 'బొంబాయి ప్రియుడు' అని పెట్టి సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఓ సినిమాను తీసి మంచి హిట్ అందుకున్నారు. ఇది ముంబయి బ్యాక్​డ్రాప్​లో నడిచే ఓ అందమైన ప్రేమ కథ. జెడి చక్రవర్తి, రంభ జంటగా నటించింన ఈ సినిమా ఏకంగా 100 డేస్ ఫంక్షన్ జరుపుకుంది. ఆ తర్వాత 1991లో విడుదలైన 'రౌడీ అల్లుడు' చిత్రం కూడా కొంత ముంబై బ్యాక్​డ్రాప్​లోనే ఉంటుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఆటో జానీ అనే పాత్రలో నటించారు. ఆయన ముంబయి వీధుల్లో ఆటోవాలాగా కనిపించారు.

ఇక కోడి రామకృష్ణ తెరకెక్కించిన 'దేవి పుత్రుడు' సినిమాలో విక్టరీ వెంకటేశ్​ కూడా ముంబయిలో దొంగతనాలు చేసే వ్యక్తిగా కనిపించి అలరించారు. ఇలా ముంబయితో మన హీరోలకు మంచి అనుబంధమే ఉంది. ఇది కాకుండా పూర్తి ముంబయి బ్యాక్​డ్రాప్​లో ఓ సాలిడ్ హిట్​ను తెరకెక్కించారు డైరెక్టర్ పూరి. మహేశ్​ బాబు లీడ్​ రోల్​లో వచ్చిన బిజినెస్ మాన్ అక్కడి మాఫియా బ్యాక్​డ్రాప్​లోనే నడుస్తుంది. ఇందులో మహేశ్ ముంబయి డాన్​గా నటించి హిట్ అందుకున్నారు. అంతేకాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం కూడా ముంబయి కథాంశంతోనే నడుస్తుంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ నడుస్తున్న నేపథ్యంలో మన హీరోలు ముంబయి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్- డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్​లో ఫిక్స్​ అయిన 'ఓజీ' సినిమా కూడా పూర్తి ముంబయి బ్యాక్​డ్రాప్​తోనే రానుంది. ఇందులో పవన్ ఓ గ్యాంగ్​స్టర్ పాత్రలో కనిపించనున్నారు. అక్కడి నేటివిటీకి తగ్గట్లుగా డైరెక్టర్​ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే వచ్చిన హంగ్రీ చీతా గ్లింప్స్​లో పవన్ మరాఠీ కూడా మాట్లాడారు.

కోలీవుడ్​లోనూ అదే హవా
Koywood Movies On Mumbai Backdrop : ఇక టాలీవుడ్​లోనే కాకుండా కోలీవుడ్​లోనూ ముంబయి హవా నడుస్తోంది. ముంబయిలో చాలా వరకు తమిళులు ఉన్నారు. వారి కోసం కోలీవుడ్ హీరోలు ముంబయి నేపథ్యంలో వచ్చే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కమల్ హాసన్ 'నాయకుడు', రజనీకాంత్ 'బాషా' వంటి చిత్రాలు అదే నేపథ్యంలో తెరకెక్కి బ్లాక్​బస్టర్లుగా నిలిచాయి. ఇక మణిరత్నం రూపొందించిన 'బొంబాయి' చిత్రం ఆల్​టైమ్ క్లాసిక్​గా నిలిచిపోయింది.

ముంబయిలోనే మకాం
ఇటీవలే రజనీకాంత్ లీడ్​ రోల్​లో వచ్చిన 'కాలా' చిత్రం పూర్తి ముంబయి బ్యాక్​గ్రౌండ్​లోనే నిర్మించారు. ఇక తాజాగా వచ్చిన 'లాల్ ​సలామ్​' సైతం ముంబయి బ్యాక్​డ్రాప్​లోనే నడిచింది. టాలీవుడ్​లో రామ్- పూరి 'డబుల్ ఇస్మార్ట్' ఇప్పుడు శరవేగంగా ముంబయిలో షూటింగ్ జరుపుకుంటుంది. అంతకుముందు పూరి 'లైగర్' సినిమాను కూడా ముంబయి బ్యాక్​డ్రాప్​లోనే నిర్మించారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ పూరి తన మకాంను ముంబయికి మార్చి అక్కడి నుంచే చిత్రాలను నిర్మిస్తున్నారు.

OG Glimpse : OG గ్లింప్స్ డీటైల్స్​ లీక్.. తెలుగులోనే తొలిసారి అలా.. ఇది తెలిస్తే గూస్​బంప్సే!

Last Updated : Feb 17, 2024, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.