ETV Bharat / entertainment

ఆ డైరెక్టర్ల కెరీర్​లో రీమేక్​లకు నో ఛాన్స్​- ఈ లిస్ట్​లో పూరీ రూటే సెపరేటు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 7:41 PM IST

Tollywood Directors Never Remake: ఈ మధ్యకాలంలో ఒక భాషలో సినిమా హిట్టైతే దాన్ని ఇంకో ఇండస్ట్రీ డైరెక్టర్లు రీమేక్​ చేయడం సాధారణమైంది. అలా తెలుగులో ఇప్పటివరకు అనేక రీమేక్ సినిమాలు వచ్చాయి. అయితే టాలీవుడ్​లో ఇప్పటి దాకా రీమేక్ సినిమాలు డైరెక్ట్ చేయని దర్శకులు ఎవరో తెలుసా?

Tollywood Directors Never Remake
Tollywood Directors Never Remake

Tollywood Directors Never Remake: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి రీమేక్స్ అనేవి కొత్తేమీ కాదు. మాయాబజార్ కాలం నుంచి కూడా రీమేకులు తెలుగు సినిమాలు అలరిస్తూనే ఉన్నాయి. సినిమా రీమేక్ చేయడం అనేది చాలాసార్లు సక్సెస్ అవుతుందని హీరో డైరెక్టర్లు అనుకుంటారు. ఎందుకంటే ఒక భాషలో సక్సెస్ అయిన ఫార్ములా, మరో భాషలో సక్సెస్ అవుతుందని డైరెక్టర్లు నమ్ముతారు. ఈ నమ్మకంతోనే రీమేక్ సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్​లో ఇప్పటివరకూ రీమేక్​ల జోలికి వెళ్లని దర్శకులు ఎవరో మీకు తెలుసా?

కెరీర్​లో రీమేక్​లు చేయని దర్శకులు వీరే: తెలుగులో ఇప్పటివరకు రీమేక్ జోలికి వెళ్ళని సీనియర్ దర్శకులు చాలామంది ఉన్నారు. వీళ్ళందర్లో ముందు వరుసలో నిలిచేది దర్శక ధీరుడు రాజమౌళి. రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించినవే కావడం విశేషం.

ఇక మరో దర్శకుడు సుకుమార్ కూడా ఇప్పటిదాకా రీమేక్​ల జోలికి వెళ్లలేదు. అలాగే ఈ లిస్ట్​లో కొరటాల శివ కూడా ఉన్నారు. ఇక ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పూరి జగన్నాథ్ పేరు. ఎందుకంటే వీళ్లందరి కంటే పూరియే ఎక్కువ సినిమాలు తీశారు. ఆయన ఇప్పటివరకు తీసిన 35 పైగా సినిమాల్లో ఒకటి కూడా రీమేక్ లేదు.

యువ దర్శకుల్లో వీరి రూటే సెపరేటు: ఇక యువ దర్శకుల్లో చూసినట్లయితే అనిల్ రావిపూడి, బాబి కూడా రీమేక్​లకు దూరంగా ఉన్నారు. అయితే సీనియర్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్​ కూడా అఫీషియల్​గా రీమేక్​ సినిమా తీయలేదు. మధ్యలో 'అ ఆ' సినిమా విషయంలో కాస్త వివాదం ఉన్నప్పటికీ, ఆ సినిమాను రీమేక్​ అని చెప్పలేం. ఇలా తెలుగులో రీమేక్​ల జోలికి వెళ్లకుండా తమ సృజనాత్మకత శక్తికి పదును పెడుతూ కొనసాగుతున్న దర్శకుల సంఖ్య టాలీవుడ్​లో తక్కువేమీ లేదు.

ఇదంతా ఒక ఎత్తైతే తెలుగులో సీనియర్ డైరెక్టర్లు మాత్రం ఒక దశ వచ్చాక రీమేక్​లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కొంతమంది దర్శకులు అయితే, కేవలం రీమేక్​లు చేయడం ద్వారానే మంచి పేరు తెచ్చుకున్నారు. వారెవరంటే?

ఈ లిస్ట్​లో భీమినేని శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. ఆయన తీసిన 13 సినిమాల్లో 12 సినిమాలు రీమేక్​లు అంటే ఆశ్చర్య పోవాల్సిందే. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సుస్వాగతం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచింది. ఇక ఈ మధ్యకాలంలో రీమేక్స్ చేస్తున్న దర్శకుల్లో హరీష్ శంకర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'దబాంగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' ద్వారా సక్సెస్ ట్రాక్ ఎక్కిన హరీష్, ఆ తర్వాత తమిళ్ సూపర్ హిట్ సినిమా 'జిగర్తాండ'ను తెలుగులో 'గద్దలకొండ గణేశ్​' పేరుతో రీమేక్ చేసి మరో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్​తో 'భవదీయుడు భగత్ సింగ్' చేస్తున్నారు. ఈ సినిమా కూడా విజయ్ నటించిన తమిళ్ సినిమా రీమేక్​గా చెప్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముంబయిలో మకాం - ఆ సినిమాలన్నింటికీ ఒకే కేరాఫ్ అడ్రెస్

బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్ల లాస్ అయినా ఆ​ ​ హీరోతో రూ. 600 కోట్ల మూవీ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.