ETV Bharat / entertainment

ఓ అందమైన అమ్మాయి దెయ్యంగా మారితే - OTTలోకి వెన్నులో వణుకు పుట్టించే మూవీ - ది నన్ 2 ఓటీటీ రిలీజ్ డే్

The Nun 2 OTT Release Date : ఓటీటీలోకి మరో వెన్నులో వణుకు పుట్టించే బ్లాక్ బాస్టర్ సినిమా వచ్చేసింది. మీరు భయపడకుండా చూడగలరా? ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఓ అందమైన అమ్మాయి దెయ్యంగా మారితే - OTTలోకి వెన్నులో వణుకు పుట్టించే మూవీ

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 8:12 AM IST

Updated : Feb 8, 2024, 11:11 AM IST

The Nun 2 OTT Release Date : హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. తెలుగులోనూ ఈ జానర్ సినిమాలు చాలానే వచ్చి ఆకట్టుకున్నాయి. అయితే వెన్నులో వణుకు పుట్టించే సినిమాలకు హాలీవుడ్​ కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్​లో అయితే ఈ దెయ్యాల సినిమాలు చాలానే వచ్చాయి. ది కంజూరింగ్, ఈవిల్ డెడ్, అనాబెల్లె, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీలు వరల్డ్​ వైడ్​గా రిలీజై మంచి క్రేజ్​ను కూడా దక్కించుకున్నాయి.

ఇక ఇదే బ్యానర్​లో 2018లో వచ్చిన మరో హారర్ థ్రిల్లర్ 'ది నన్'. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగానే భయపెట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది. ఆడియెన్స్​ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇక ఈ చిత్రానికి దాదాపు ఐదేళ్ల తర్వాత సీక్వెల్​ కూడా వచ్చింది. 'ది నన్ 2'(The Nun 2 Movie review) పేరుతో దీన్ని రూపొందించారు. గతేడాది సెప్టెంబర్ 8న వరల్డ్ వైడ్​గా రిలీజై ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను ఓ రేంజ్​లో భయపెట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జియో సినిమా ఫ్లాట్​ఫామ్​ వేదికగా ఇంగ్లీష్​తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన హారర్ మూవీ లవర్స్ ఉంటే మీరు ఇప్పుడు డైరెక్ట్​గా ఇంట్లోనే చూసేయ్యండి.

ఇదే కథ : దెయ్యంగా మారిన ఓ అందమైన అమ్మాయి కథే 'ది నన్ 2' సినిమా. ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు అలా దెయ్యంగా మారింది? అసలేం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని జేమ్స్ వాన్, పీటర్ సాఫ్రన్, జుడ్సన్ స్కాట్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. మైఖేల్ చేవ్స్ దర్శకత్వం వహించారు. మూవీలో సిస్టర్ ఇరేనే అనే ప్రధాన పాత్రలో టైస్సా ఫార్మి నటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'అఖండ 2' బిగ్ లీక్​​ - నందమూరి ఫ్యాన్స్​కు పూనకాలు లోడింగ్​!

తాతకు తగ్గ మనవడే - ఎన్టీఆర్ డ్రీమ్​ రోల్ ఏంటో తెలుసా?

Last Updated : Feb 8, 2024, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.