ETV Bharat / entertainment

యూట్యూబర్ సినిమాలో తమన్ - 'బాయ్స్'​ తర్వాత మరోసారి స్క్రీన్​పై! - Thaman Guest Role - THAMAN GUEST ROLE

Thaman New Movie : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారట. ఆ విశేషాలు మీ కోసం.

Thaman New Movie
Thaman New Movie (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 9:41 AM IST

Updated : May 21, 2024, 9:51 AM IST

Thaman New Movie : తన యూట్యూబ్​ వ్లాగ్స్​తో, సెలబ్రిటీలతో చేసిన రీల్స్​ ద్వారా పాపులరైంది యంగ్ స్టార్ నిహారిక. ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్​ కంటెంట్​తో అభిమానులను ఆకట్టుకునే ఈమె త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందట. పాన్​ఇండియా లెవెల్​లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.

కోలీవుడ్ స్టార్ హీరో అధర్వ ఈ సినిమాలో లీడ్​ రోల్​లో మెరవనున్నారు. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్​ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న తమన్, ఇందులో గెస్ట్​ రోల్​లో కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. తమన్ గతంలో శంకర్ డైరెక్షన్​లో తెరకెక్కిన 'బాయ్స్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Last Updated : May 21, 2024, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.