Suhas PrasannaVadanam Movie Heroine Payal Radhakrishna : రీసెంట్గా విడుదలైన ప్రసన్న వదనం మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 'బెంగళూరు అండర్ వరల్డ్' మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాధాకృష్ణ సుహాస్ జోడీగా యాక్ట్ చేసింది.
'ప్రసన్న వదనం' సినిమా మే 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కన్నట బ్యూటీ పాయల్ రాధాకృష్ణ చెబుతున్న ఆసక్తికర కబుర్లు మీకోసం.
- మోడల్‌గా పాపులర్ - పాయల్ కర్ణాటక, మంగళూరులో పుట్టింది. చదువంతా బెంగళూరులోనే సాగింది. కళాశాల రోజుల్లో ప్రసాద్ బిడప్ప మోడల్ మేనేజ్‌మెంట్, ది మెగా మోడల్ హంట్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. తరువాత ముంబయిలో ఫ్రీలాన్సర్‌గా పనిచేసింది. ఆమె అమెజాన్ ఇండియా, సఫోలా, ముస్లిం మ్యాట్రిమోనీ, భీమా అండ్ బ్రదర్స్, రెక్సోనా వంటి బ్రాండ్‌ల కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్‌లకు పని చేసింది.
- 19 ఏళ్లకే అవకాశం - సినిమా పరిశ్రమలోకి వచ్చేందుకు కుటుంబం ఒప్పుకోకపోతే పట్టుబట్టి మరీ యాక్టింగ్ లో డిప్లొమా చేసింది. పాయల్ తల్లి క్లాసికల్ డ్యాన్స్ ర్. ఓ అకాడమీని కూడా నిర్వహిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణకి చిన్నతనం నుంచి ట్రెడిషినల్ డ్యాన్స్ అంటే ఆసక్తి. స్కూలు, కాలేజీ రోజుల్లో చాలానే స్టేజీ ప్రదర్శనలు ఇచ్చింది. 19 ఏళ్ల వయసులోనే సినిమాల్లో తొలి అవకాశం వచ్చింది. తల్లిదండ్రులిద్దరూ బిజీగా ఉండటం వల్ల ఆమెతో ఒక్కసారి కూడా షూటింగ్ వద్దకు రాలేదు.
- టాలీవుడ్ అభిమాన హీరోలు ఎవరంటే?
పాయల్ చాలా ఇంటర్వ్యూల్లో తన ఆసక్తులు, ఇష్టాలు గురించి షేర్ చేసుకుంది. తెలుగు భాష నేర్చుకోవడానికి గల కారణాలు తెలిపింది. 'మొదట్లో నాకు భాష మరీ ఇబ్బందిగా అనిపించేది. యాడ్లు చేసేటప్పుడు చాలా మంది నాపై విమర్శలు చేశారు. అందుకే తెలుగు మాట్లాడటం నేర్చకున్నాను. తెలుగులో అల్లు అర్జున్, మహేష్ బాబుతో యాక్ట్ చేయాలని ఉంది. తమిళ ఇండస్ట్రీలో ధనుష్ అంటే చాలా ఇష్టం.’ అని చెప్పింది.
- పెంపుడు జంతువులు ఇష్టం లేదు
సాధారణంగా చాలా మంది ఫిల్మ్ సెలబ్రిటీలు కుక్కలు, పిల్లలు ఎక్కువగా పెంచుకోవడం చూసుంటారు. కానీ ఈ కన్నడ ముద్దుగుమ్మకు పెంపుడు జంతువులంటే ఇష్టమే లేదట. అంతేకాదు యాడ్స్ కానీ, సినిమాలో కానీ పెంపుడు జంతువులతో సీన్ చేయాలంటే ఎక్కువ ఛార్జ్ చేస్తానని చెబుతోంది. బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమని, బోర్ కొట్టినప్పుడల్లా ఒంటరిగానే రౌడ్‌కు వెళ్తానని చెప్పింది. స్నేహితులతో పార్టీలు, ఫంక్షన్లలో ఎంజాయ్ చేయడమూ ఇష్టమని తెలిపింది.
ప్రస్తుతం 'చారీ పాఠం' అనే మరో సినిమాలోనూ పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది. అంతకు ముందు 'తరగతి గది దాటి' వెబ్‌సిరీస్‌తోపాటు 'భిన్నా', 'లైఫ్ 360', 'సింగపెన్నె', 'నిమ్మోల్లారా ఆశీర్వాద', 'మధురమే ఈ క్షణం', 'అలా నిన్ను చేరి' తదితర సినిమాల్లో ఆకట్టుకుంది.
వీటి కోసమే ఆడియెన్స్ తెగ వెయిటింగ్ - లిస్ట్‌లో టాలీవుడ్ మూవీ ఒక్కటే! - TOP 10 Upcoming Movies
ఎట్టకేలకు ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ కన్ఫామ్ - వచ్చేది ఆ రోజే - Kalki 2898 AD Release Date