Shakahaari Telugu OTT : ఓటీటీలో ఈ మధ్య బ్లాక్ బస్టర్ కంటెంట్లు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆడియెన్స్‌కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయి. అలా ఈ ఏడాది కన్నడలో చిన్న సినిమాగా విడుదలై మంచి సక్సెస్ సాధించిన సినిమా శాఖాహారి. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి వచ్చేసింది.
ఈ శాఖాహారి తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. సినిమాలో రంగాయన రఘుతో పాటు గోపాలకృష్ణ దేశ్‌పాండే, వినయ్‌యూజే ప్రధాన పాత్రలు పోషించారు. మొదటగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఎందుకంటే సాంగ్స్, ఫైట్లు, కామెడీ ఉండే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా రియలిస్టిక్ ఎలిమెంట్స్‌తో మూవీ సాగుతుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో కేవలం ఐదారు ప్రధాన పాత్రలతో సినిమాను రూపొందించారు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయే థ్రిల్‌తో పాటు సర్ప్రైజ్ను ఇస్తుంది.
ఈ చిత్రానికి సందీప్ సుంకడ్ దర్వకత్వం వహించారు. సినిమాలో రంగాయన రఘు నటన, దర్శకుడి టేకింగ్, మేకింగ్‌తో పాటు కథలోని ట్విస్ట్‌లు ఆడియెన్స్‌కు సూపర్ థ్రిల్‌ను పంచుతున్నాయి.
సినిమా కథ ఇదే(Shakahaari Movie Story) - ఓ టిఫిన్ సెంటర్ నడిపే సుబ్బన్న(రంగాయన రఘు) యాభై ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అతడికి తమ్ముడు ఒక్కడే ఉంటాడు. మరోవైపు బీఎస్ఎఫ్‌లో ఉద్యోగం సంపాదించిన విజయ్ (వినయ్ యూజే) అనూహ్యంగా తన భార్య సౌగంధిక మర్డర్ కేసులో నిందితుడిగా ఇరుక్కుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బుల్లెట్ గాయంతో సుబ్బన్న హోటల్‌లో తలదాచుకుంటాడు.
అయితే విజయ్ తప్పించుకోవడం వల్ల ఎస్ఐ మల్లిఖార్జున (గోపాలకృష్ణ దేవ్‌పాండే) ఉద్యోగం కూడా చిక్కుల్లో పడుతుంది. దీంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా ఉండగానే సుబ్బన్న దగ్గర తలదాచుకున్న విజయ్ అనుకోకుండా మృతి చెందుతాడు. మరి విజయ్ మృతదేహం పోలీసులకు దొరక్కుండా సుబ్బన్న ఎలా, ఎందుకు మాయం చేశాడు? విజయ్‌కు జరిగిన అన్యాయంపై సుబ్బన్న ఎలా, ఎందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు? మరి చివరికి సుబ్బన్నను మల్లిఖార్జున పట్టుకున్నాడా? లేదా? అన్నదే మిగతా కథ. సినిమా మొత్తం ఆద్యంతం ట్విస్టులతో సాగింది.
ప్రశాంత్ నీల్ ఇదంతా నిజమేనా? - Prasanth Neel Ajith Kumar
హీరో రెడీ, మరి సినిమా ఎప్పుడు? - మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటోషూట్ వీడియో వైరల్ - Mokshagna Nandamuri