Salman Khans House Firing Case : ముంబయిలోని బాంద్రాలోని హీరో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల విషయంలో తాజాగా విక్కీ గుప్తా, సాగర్ పాల్ అనే ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది. కాల్పుల తర్వాత ముంబయి నుంచి పారిపోయిన నిందితులిద్దరినీ గుజరాత్‌లోని భుజ్‌లో సోమవారం అర్థరాత్రి పట్టుకున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం వారిని ముంబయికి తరలించనున్నారు.
మరోవైపు ఇదే కేసు విషయంలో ముగ్గురిని విచారించారు పోలీసులు. వీరిలో నిందితుల ఇంటి ఓనర్, వాళ్లు ఉపయోగించిన టూ వీలర్ పాత ఓనర్, ఆ బైక్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్ ఉన్నారు. అయితే విచారణలో అనూహ్యమైన నిజాలు బయటకొచ్చాయి. న్వెల్‌లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు తెలుస్తోంది. ఇక కాల్పుల సమయంలో సల్మాన్‌ఖాన్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
"మౌంట్ మేరీ చర్చి దగ్గర బైక్‌ను వదిలిన నిండితులు కొంతదూరం పాటు నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఓ ఆటోలో బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ నుంచి బొరివలి వైపు వెళ్లే రైలును ఎక్కారు. కానీ, శాంతాక్రజ్ రైల్వేస్టేషన్‌లో దిగి బయటకు వెళ్లిపోయారు" అంటూ ఓ అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా, ఘటనపై దర్యాప్తు కోసం పలు టీమ్స్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు, వాళ్లను బిహార్, రాజస్థాన్, దిల్లీ తదితర ప్రాంతాలకు పంపారు. అయితే సల్మాన్ ఇంటి ముందు ఎప్పుడూ ఉండే పోలీసు వాహనం కాల్పుల సమయంలో లేకపోవడం పైనా కూడా దర్యాప్తు జరుగుతోంది.
'ఆ పని చేసింది మేమే'
సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపింది తామే అంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. 'ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమే. మా బలంమేంటో ఇప్పటికే నీకు తెలిసి ఉంటుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నెక్ట్స్ టైమ్ తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదు. మా టార్గెట్ మీస్ అవ్వదు' అని పోస్ట్‌లో రాసి ఉంది. ఈ పోస్ట్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
సల్మాన్ పేరుతో మోసం - వారికి హీరో టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన దుండగులు - Firing outside Salman Khan Home