ETV Bharat / entertainment

'సలార్- 2' క్రేజీ అప్డేట్- ప్రభాస్​​​ మూవీలో బాలీవుడ్ బ్యూటీ! - Salaar Part 2 Heroine - SALAAR PART 2 HEROINE

Salaar Part 2 Heroine: రెబల్ స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ సూపర్ హిట్ మూవీ సలార్ పార్ట్- 1 సీక్వెల్ తాజాగా ప్రారంభమైంది. అయితే రీసెంట్​గా షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా గురించి అప్పుడే ఓ క్రేజీ వార్త వినిపిస్తోంది.

Salaar Part 2 Heroine
Salaar Part 2 Heroine
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 7:54 AM IST

Updated : Apr 23, 2024, 8:01 AM IST

Salaar Part 2 Heroine: పాన్ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన 'సలార్ పార్ట్- 1' గతేడాది బ్లాక్​బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్​తో తెరకెక్కిన ఈ మూవీ డార్లింగ్ ప్రభాస్​కు మంచి సక్సెస్ అందించింది. ఇక తొలి భాగానికి కొనసాగింపుగా 'శౌర్యాంగ పర్వం' పేరుతో రెండో పార్ట్​ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా రీసెంట్​గా ప్రారంభమైంది. రీసెంట్​గా ఈ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ షూటింగ్​పై అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్​లో చిత్రీకరణ ప్రారంభమైందని, 2025లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఇంతలోనే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందట. రెండో పార్ట్​లో ఆమె ప్రభాస్​తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కియారాతో ఓ స్పెషల్ సాంగ్ కూడా డిజైన్ చేస్తున్నారట. కానీ, కియారా పాత్ర సెంకడ్ హాఫ్​లో ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఇక ప్రభాస్- కియారా జోడీ బిగ్ స్క్రీన్​పై సందడి చేస్తుంటే క్రేజీగా ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజమో కానీ అప్పుడే సినిమాపై హైప్ క్రియేటైంది.

ఇదేం తొలిసారి కాదు: ప్రభాస్​తో బాలీవుడ్ బ్యూటీలు స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఇదేం కొత్త కాదు. ఇప్పటికే పలువురు బీ టౌన్ ముద్దుగుమ్మలతో ప్రభాస్ నటించారు. గతంలో డార్లింగ్ కంగనా రనౌత్ (ఏక్ నిరంజన్), కృతి సనన్ (ఆదిపురుష్) సినిమాల్లో నటించారు. ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న కల్కిలో కూడా ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది.

ఇక తొలి పార్ట్​లో శ్రుతి హాసన్ హీరోయిన్​గా నటిచింది. రెండో పార్ట్​లో కూడా ఆమె కొనసాగనుంది. అయితే సలార్ పార్ట్​-1లో శ్రుతి హాసన్​కు పెద్దగా డైలాగులు, స్క్రీన్ టైమ్​ ఇవ్వలేదు. సినిమా మొత్తం ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్​పైనే సాగింది. మరి సీక్వెల్​లోనైనా ప్రశాంత్ హీరోయిన్లకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారో. ఇక తొలిపార్ట్​లో సీనియర్ నటుడు జగపతిబాబు, శ్రేయా రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. కాగా ఈ సినిమా గతేడాది డిసెంబర్​లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా వరల్డ్​వైడ్​గా దాదాపు రూ.700+ కోట్లు వసూల్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలో 'సలార్' క్రేజ్ పీక్స్- ఫారినర్స్ రెస్పాన్స్ అదుర్స్

'సలార్' ప్రభాస్ డైలాగ్స్​ వీడియో - షాక్​ అవుతున్న ఆడియెన్స్​!

Last Updated : Apr 23, 2024, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.