Game Changer Teaser : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే దీపావళి సందర్భంగా మూవీమేకర్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. నవంబర్ 9న టీజర్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. రైల్వే ట్రాక్ మధ్యలో కూర్చొని ఉన్న చెర్రీ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో రామ్‌చరణ్ లుంగీ, బనియన్ ధరించిన లుక్‌తో కనిపిస్తున్నారు. 'హ్యాపీ దీపావళి. నవంబర్ 9న గేమ్ ఛేంజర్ టీజర్ సెలబ్రేట్ చేసుకుందాం' అని పోస్ట్‌కు రాసుకొచ్చింది. కాగా ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందించగా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. 2025 జనవరి 10న మూవీ రిలీజ్ కానుంది.
Happy Diwali Folks 😎💥
— Game Changer (@GameChangerOffl) October 31, 2024
Celebrate #GameChangerTeaser from Nov 9th 🧨🔥#GameChanger In cinemas near you from 10.01.2025! pic.twitter.com/Y5pbNNftdu