ETV Bharat / entertainment

ముంబయిలో విశాలమైన బంగ్లా - ఈ కొత్త జంట ఆస్తుల వివరాలు తెలుసా ? - రకుల్ ప్రీత్ సింగ్ నెట్​ వర్త్

Rakul Jackky Networth: బాలీవుడ్​ స్టార్ కపుల్ రకుల్​ ప్రీత్ సింగ్​, జాకీ భగ్నానీ నెట్​వర్త్ ఎంతంటే ?

Rakul Jackky Networth
Rakul Jackky Networth
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 9:15 PM IST

Rakul Jackky Networth : బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంలో తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గోవాలోని ఓ ప్రముఖ హోటల్​లో ఆనంద్​ కరాజ్​, సింధీ స్టైల్​లో వీరి వివాహ వేడుక గ్రాండ్​గా జరిగింది. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ప్రస్తుతం ఈ జంట ఆస్తుల గురించి సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ఇంతకీ వీరి ఆస్తుల విలువ ఎంతంటే ?

బీటౌన్​లో పాపులర్​ యాక్టర్స్​లో రకుల్, జాకీ కూడా టాప్​ పొజిషన్​లో ఉన్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్​లో స్థిపరడ్డ ఈ జంట ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో సక్సెస్​ఫుల్​గా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ వర్గాల సమచారం ప్రకారం వీరి నికర ఆస్తుల విలువ రూ. 84కోట్లని అంచనా. అందులో రకుల్ ఆస్తుల విలువ రూ. 49కోట్లు కాగా, ఆమె భర్త జాకీ ఆస్తులు రూ. 35కోట్లని అంచనా.

హైదరాబాద్, ముంబయిలో బంగ్లాలు:
'గిల్లీ' అనే కన్నడ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో మెరిసిన ఈ చిన్నది, ఈ మధ్యే బాలీవుడ్ లో దశాబ్దకాలం పూర్తి చేసుకుంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రకుల్​ ఒకానొక సమయంలో ఏడాదిలో 5 సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత 15 ఏళ్లలో ఈ స్టార్ హీరోయిన్ అటు సినిమాలతో పాటు ఇక యాడ్స్​, బ్రాండ్ ఎండార్స్​మెంట్స్​తో భారీ రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం. కోవిడ్​కు ముందు ముంబయిలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్​ను కొనుగోలు చేసిందట రకుల్.

అంతేకాకుండా హైదరాబాద్​లోనూ దాదాపు రూ. 3 కోట్ల విలాసవంతమైన త్రిబుల్ బెడ్ రూం బంగ్లాను కొనుగోలు చేసిందని సినీ వర్గాల టాక్​.ఇక హైదరాబాద్ , వైజాగ్​లో రకుల్​కు మూడు జిమ్స్ కూడా ఉన్నాయి. వీటితోపాటు మెర్సిడెజ్ బెంజ్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, బీఎండబ్ల్యూ 520డీ, ఆడీ క్యూ3, మెర్సిడెట్ మెబాజ్ జీఎల్ఎస్ 600 సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇలా మొత్తంగా రకుల్ దగ్గర రూ. 49కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయట.

జాకీ భగ్నానీ ఆస్తులు :
మరోవైపు రకుల్ భర్త జాకీ నెట్​వర్త్​ కూడా బాగున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రముఖ నిర్మాత వాషు భగ్నాని తనయుడైన జాకీ భగ్నాని పూజా ఎంటర్​టైన్​మెంట్ అనే నిర్మాణ సంస్థపై పలు సినిమాలను నిర్మించారు. ముంబయిలోని బాంద్రాలో ఈయనకు 6 వేల చదరపు అడుగుల విశాలమైన బంగ్లాను కొనుగోలు చేశాడు. పోర్స్ కేయన్ని, మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఎస్, మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్, రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా జాకీ దగ్గర రూ. 35 కోట్ల ఆస్తులు ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

రకుల్ తొలి జీతం ఎంతో తెలుసా? - అలాంటి పని చేసి సంపాదించిందట!

పెళ్లి పీటలపై రకుల్- జాకీ జంట - చూడముచ్చటగా ఫొటోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.