ETV Bharat / entertainment

సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - వీరలెవల్​లో ఆ బ్లాక్​బస్టర్​ మూవీకి సీక్వెల్! - రజనీకాంత్ జైలర్ 2

Rajinikanth Jailer 2 : సూపర్ స్టార్ రజనీకాంత్​కు భారీ హిట్ ఇచ్చిన 'జైలర్' - సీక్వెల్​ తెరకెక్కెందుకు రెడీ అవుతోందని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయమే కోలివుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు నెల్సన్ కుమార్​ వర్క్​ స్టార్​ చేశారట! ఆ వివరాలు.

సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - వీరలెవల్​లో ఆ బ్లాక్​బస్టర్​ మూవీకి సీక్వెల్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 5:58 PM IST

Rajinikanth Jailer 2 : 'రోబో' తర్వాత 'కొచ్చాడియాన్'​, 'లింగ', 'కబాలి', '2.0', 'కాలా', 'పేట', 'దర్బార్'​, 'అన్నాత్తే' వంటి సినిమాలు చేసినా ఏ మూవీ ఇవ్వనీ ఆనందం సూపర్ స్టార్ ఫ్యాన్స్​కు 'జైలర్'​ ఇచ్చింది. ఈ చిత్రంతోనే రజనీకాంత్​ భారీ కమ్​ బ్యాక్​ ఇచ్చారు. ఇక అప్పటివరకు కాస్త డల్​గా ఉన్న రజనీ ఫ్యాన్స్​ కూడా ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలారు. అంతలా ఈ చిత్రం రూ.600 వందల కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

నెల్సర్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలోని మ్యాజిక్‌, రజనీకాంత్‌ మాస్‌ అండ్​ స్టైల్​ హంగామా, ఎలివేషన్లు, తమన్నా అందాలు, సునీల్, యోగిబాబు కామెడీ ఆద్యంతం అభిమానుల్ని కట్టి పడేసింది. దీనికి తోడు శివ రాజ్‌ కుమార్‌ మాస్‌ ఎంట్రీ, మోహన్‌లాల్‌ స్పెషల్‌ అట్రాక్షన్​ అదరగొట్టేశాయి. థియేటర్లలో ఆడియెన్స్ ఊగిపోయారు. దీంతో ఈ చిత్రం కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్​లో ఒకటిగా నిలిచిపోయింది.

అయితే ఈ మూవీకి సీక్వెల్‌ ఉంటుందని అప్పట్లో నెల్సన్ కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా గురించి అప్డేట్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు దిలీప్‌ కుమార్‌ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారట. 'జైలర్‌ 2' నెక్ట్స్ లెవల్‌లో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం అందుతోంది. రజనీ కూడా సీక్వెల్​కు రెడీనే అన్నారట. కాకపోతే ఆయన అందుబాటులోకి రావడానికి కాస్త టైమ్​ పట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం రజనీకాంత్‌ చేతిలో సినిమాలు ఉన్నాయి. టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్‌, దగ్గుబాటి రానా, ఫహద్​ ఫాజిల్‌, మంజు వారియర్‌, రితికా సింగ్​తో కలిసి 'వెట్టయాన్‌' సినిమా చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తుంది. ఇప్పటికే రజనీకాంత్‌ తన కూతురు దర్శకత్వంలో నటించిన 'లాల్‌ సలామ్‌' రిలీజ్​కు రెడీగా ఉంది. ఇంకా 'విక్రమ్‌', 'లియో' ఫేమ్‌ లోకేశ్​ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాల తర్వాతే రజనీకాంత్‌ - నెల్సన్​కు అందుబాటులోకి రానున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సలార్' ప్రభాస్ డైలాగ్స్​ వీడియో - షాక్​ అవుతున్న ఆడియెన్స్​!

బాలయ్య సినిమాలో విలన్​గా బిగ్​బాస్ శివాజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.