ETV Bharat / entertainment

బెస్ట్ యాక్టర్​గా పృథ్విరాజ్ సుకుమారన్​ - సర్వైవల్​ థ్రిల్లర్ 'ఆడు జీవితం'కు 8 అవార్డులు - Aadu Jeevitham 8 Awards

Aadu Jeevitham Prithviraj Sukumaran Best Actor Award : మలయాళ స్టార్ యాక్టర్​ పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన ఆడు జీవితం : ది గోట్‌ లైఫ్‌ చిత్రం ఏకంగా 8 అవార్డులను దక్కించుకుంది. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Aadu Jeevitham Prithviraj Sukumaran Best Actor Award (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 3:25 PM IST

Aadu Jeevitham Prithviraj Sukumaran Best Actor Award : మలయాళ స్టార్ యాక్టర్​ పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన ఆడు జీవితం : ది గోట్‌ లైఫ్‌ చిత్రానికి అవార్డుల పంట పండింది. కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డ్స్​ 2024లో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా పలు అవార్డులను ఈ మూవీ దక్కించుకుంది. మొత్తం 8 పురస్కారాలను అందుకుందీ సినిమా.

Aadu Jeevitham Awards : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఉత్తమ నటుడిగా, దర్శకుడు బ్లెస్సీ ఉత్తమ దర్శకుడిగా అవార్డులను ముద్దాడారు. అలానే ఈ చిత్రానికి బెస్ట్​ పాపులర్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ కూడా దక్కింది. బెస్ట్‌ సినిమాటోగ్రఫీ, బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌, బెస్ట్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌, బెస్ట్‌ ప్రాసెసింగ్‌ ల్యాబ్‌, బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్​ ప్లే వంటి విభాగాల్లోనూ చిత్రానికి అవార్డులు వరించాయి. ఇంకా ఈ చిత్రంలో నజీబ్‌ సోదరుడిగా హకీమ్‌ పాత్ర పోషించిన కేఆర్‌ గోకుల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది.

ఇంకా ఉల్లుజుక్కు, తడవు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించిన ఊర్వశి, బీనా ఆర్‌ చంద్రన్ కూడా ఉత్తమ నటి విభాగంలో సంయుక్తంగా అవార్డుకు ఎంపికవ్వడం విశేషం.

కాగా, పృథ్వీరాజ్ సుకుమారన్ గతంలో కూడా ఉత్తమ నటుడిగా అవార్డులను ముద్దాడారు. 2006, 2012 సంవత్సరాల్లో కేరళ స్టేట్ అవార్డులను పృథ్వీరాజ్ అందుకున్నారు. దీంతో పృథ్విరాజ్​కు ఇది మూడో రాష్ట్ర ఉత్తమ నటుడి పురస్కారం.

ఇదీ కథ(Aadu Jeevitham Story) - కేరళ నుంచి వలస కార్మికుడిగా గల్ఫ్‌ వెళ్లి అక్కడ ఇరుక్కుపోయిన నజీబ్‌ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించారు. ఆయన నటన తీరు, లుక్స్​కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఎడారిలో ఏళ్ల తరబడి బానిసత్వంలో ఉండిపోయి ఆకలిదప్పులను ఎదుర్కొంటూ సాగించిన బతుకు పోరాటమే ఈ చిత్ర కథ. ఈ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ పడిన కష్టానికి ఈ అవార్డు రూపంలో తగిన గుర్తింపు దొరికిందంటూ మూవీ లవర్స్​ సోషల్‌మీడియాలో అనందం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

70th National Film Awards : బెస్ట్ తెలుగు ఫిల్మ్ 'కార్తికేయ 2', బెస్ట్​ యాక్టర్ రిషబ్​ శెట్టి - 70th national film awards

కల్కి, ఫైటర్ వసూళ్లను దాటేసిన 'స్త్రీ 2'- బాలీవుడ్ ఆల్​టైమ్ టాప్-10లో శ్రద్ధా మూవీ - Shraddha Kapoor Stree 2

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.