Payal Rajput Broke Boyfriend Head : టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. RX 100 చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారిన ఈ హాట్ బ్యూటీ - మూవీలో మరింత బోల్డ్‌గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే రీసెంట్గా మంగళవారం చిత్రంలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఓ భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇందులో ఆమె నటనకు అంతా ఫిదా అయిపోయారు. తనపై ప్రశంసలు కురిపించారు.
అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆమె తన వాలంటైన్స్ డే ఎలా, ఎక్కడ జరుపుకుందో తెలుపుతూ ఓ వీడియోను ఆమె పోస్ట్ చేసింది. అందులో ఆమె ప్రియుడు సౌరబ్‌తో కలిసి పబ్‌లో గడిపింది. అయితే అక్కడ ఓ షూట్లో భాగంగా ప్రియుడి తలపై బీర్ బాటిల్‌తో కొట్టింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా వాలంటైన్స్ డేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి అంటూ క్యాప్షన్ రాసి పోస్ట్ చేసింది. దీనికి ఓ నెటిజన్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. మళ్లీ ఓ సారి అలానే ట్రై చేయండి అంటూ కామెంట్ పెట్టగా దానికి సౌరబ్ అది ఒక బ్యాడ్ ఐడియా అంటూ బదులిచ్చాడు. పాయల్ నిన్న వాలంటైన్స్ డే రోజు పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకొద్దు అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పాయల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం రెడీ అవుతోంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రాలేదు.
నెట్‌ఫ్లిక్స్ చేతిలో టాలీవుడ్ బడా హీరోలు- మిగతా ఓటీటీలకు పోటీ తప్పదా?