ETV Bharat / entertainment

భర్తతో కలిసి సూపర్ స్టార్ ఇంటికి మేఘా ఆకాశ్- స్పెషల్ ఏంటంటే? - Megha Akash Marriage - MEGHA AKASH MARRIAGE

Megha Akash Marriage : హీరో నితిన్ నటించిన 'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మేఘా ఆకాశ్ త్వరలోనే పెళ్లీ పీటలు ఎక్కునుంది. ఇటీవల సైలంట్​గా తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా కాబోయే భర్తతో రజనీకాంత్ ఇంటికి వెళ్లింది.

Megha Akash Marriage
Megha Akash Marriage (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 7:12 PM IST

Megha Akash Marriage : మేఘా ఆకాశ్‌.. చెన్నైకు చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. 2017లో వచ్చిన నితిన్ 'లై' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే చెన్నై భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. తన పెళ్లికి రావాలని కోరుతూ తలైవాకు ఆహ్వానం ఇచ్చింది.

ఇక మేఘా ఆకాశ్‌కు రజనీకాంత్‌ అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. తాజాగా కుటుంబ సభ్యులతో వెళ్లి మరీ రజనీకాంత్​ను కలిసింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. 'అభిమానంతో తలైవాను ఆహ్వానించాం' అంటూ ఇస్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది. అయితే, ఫొటోలో ఎక్కడ శుభలేఖ కనిపించలేదు. కానీ పెళ్లికి ఆహ్వానించేందుకే వెళ్లినట్లు తెలుస్తోంది.

వరుడు ఎవరంటే
ఇక మేఘా ఆకాశ్- సాయి విష్ణు గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. సాయి విష్ణు ఓ పొలిటీషియన్‌ కొడుకు అని సమచారం. అయితే మేఘా పెళ్లి గురించి పలుమార్లు రూమర్స్‌ కూడా వచ్చాయి. కానీ, ఈసారి వాటిన్నింటికీ చెక్‌ పెడుతూ తన ప్రియుడి సాయి విష్ణును నిశ్చితార్ధం చేసుకుంది. కేరళలో జరిగిన ఈ కార్యక్రమం ఫొటోలు నెట్టింట తెగ వైరల్​ అవుతున్నాయి. కోస్టార్లు, ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు, ఫాలోవర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా విజయ్ ఆంటోనీ నంటిన 'తుఫాన్'(తెలుగు) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో చివరిగా 'మను చరిత్ర' సినిమాలో నటిచింది. కాగా, 'లై', 'చల్ మోహన రంగ', 'గుర్తుందా శీతాకాలం', 'రావణాసుర' వంటి సినిమాల్లో నటించిన మేఘకు హీరోయిన్​గా పెద్ద గుర్తింపు రాలేదు. 'రావణాసుర'లో చేసిన నెగటివ్ క్యారెక్టర్ కూడా మేఘ కెరీర్​కు పెద్దగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. 'వికటకవి', 'సహకుటుంబం' సినిమాల్లో నటిస్తోంది. మరి వివాహం తర్వాత కొనసాగిస్తుందో లేదో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.