ETV Bharat / entertainment

మెగా ఫ్యాన్స్​కు నిరాశ!​ - ఆ సినిమా లేనట్టేనా? - chiranjeevi Movie

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 9:21 AM IST

Updated : Aug 13, 2024, 11:40 AM IST

Chiranjeevi Indra Rerelease : మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఇంద్ర' రీరిలీజ్​పై సందిగ్ధత నెలకొంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Chiranjeevi Indra Rerelease (source ETV Bharat)

Chiranjeevi Indra Rerelease : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరోగా చేస్తున్న భారీ చిత్రం విశ్వంభర. ప్రస్తుతం షూటింగ్​తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. అయితే ఈ గ్యాప్​లో చిరు నుంచి రాబోయే సినిమా ఏదన్న ఉందంటే అది ఇంద్ర. చిరు కెరీర్​లో సెన్సేషనల్ హిట్​గా నిలిచిన ఈ చిత్రం రీరిలీజ్​ చేయనున్నట్లు ఆ మధ్య వైజయంతి మూవీస్​ అఫీషియల్​గా ప్రకటించింది.

మెగాస్టార్ బర్త్ డే కానుకగా దీన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ రాలేదు. దీంతో ఈ మూవీ రీ రిలీజ్​పై సస్పెన్స్​ నెలకొంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఇంద్ర రీ రిలీజ్ కష్టమే అని ప్రచారం జోరుగా సాగుతోంది. లేదంటే పోస్ట్​ పోన్​ అయినా చేస్తారట.

ఎందుకంటే ఈ 22కి(చిరు బర్త్​ డే) ముందు అంటే ఒక్క వారం ముందుగా నాలుగు కొత్త సినిమాలు(మిస్టర్‌ బచ్చన్‌
,డబుల్‌ ఇస్మార్ట్, తంగలాన్‌, ఖేల్‌ ఖేల్‌ మే) థియేటర్స్​లో విడుదల కానున్నాయి. కాబట్టి థియేటర్స్​కు కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని, అందుకే ఇంద్ర రీ రిలీజ్ అనుకున్న రేంజ్​లో రిలీజ్​​ ఉండకపోవచ్చు అనే టాక్​ వినిపిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దీనిపై స్పష్టత రావాలంటే మూవీటీమ్ స్పందించాల్సిందే.

Chiranjeevi Viswambara : ఇకపోతే ప్రస్తుతం చిరు నటిస్తున్న విశ్వంభర సినిమా విషయానికొస్తే ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ త్రిష కీలక పాత్రలో నటిస్తోంది. అషికా రంగనాథ్ కూడా కనిపించనుంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. సోషియో ఫాంటసీ మూవీ కావడం వల్ల వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఆ విషయంలో షారుక్​ ఖాన్‍ను బీట్​​ చేసిన శోభితా ధూళిపాళ్ల - Sobhita Dhulipala Sharukh Khan

'సూర్య, అజిత్​లాగా మీకు భారీ ఫాలోయింగ్ లేదుగా?' - రిపోర్టర్ ప్రశ్నకు విక్రమ్ స్టన్నింగ్ రిప్లై - Thangalaan Vikram

Last Updated : Aug 13, 2024, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.