ETV Bharat / entertainment

అలా చేయొద్దని నిర్మాతలకు మహేశ్‌ బాబు స్పెషల్ రిక్వెస్ట్‌! - Mahesh Babu SSMB 29 - MAHESH BABU SSMB 29

Rajamouli Mahesh Babu SSMB 29 : సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తాజాగా ఆయన ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Mahesh Babu SSMB 29 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 4:02 PM IST

Rajamouli Mahesh Babu SSMB 29 : సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు - దర్శకుడు రాజమౌళి కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి #SSMB29గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. అయితే మహేశ్‌ బాబు తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తాజాగా ఆయన ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది!

హిందీ ఆడియెన్స్‌ను SSMB29తోనే పలకరించాలని ఫిక్స్ అయ్యారట. అందుకే SSMB29 రిలీజ్ అయ్యేవరకు తన పాత సినిమాలను హిందీలోకి డబ్‌ చేసి విడుదల చేయొద్దని కోరారట. థియేటర్‌లలో రిలీజ్‌ చేయొద్దని నిర్మాతలు విజ్ఞప్తి చేశారట. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్‌గా ఏ హిందీ సినిమా చేయలేదు. దీంతో బీటౌన్‌లో ఆయనకు ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29నే తొలి చిత్రం అవుతుంది. అందుకే అక్కడి ప్రేక్షకులను అలరించేందుకు మహేశ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.

ఇకపోతే రాజమౌళి సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చేస్తున్న చిత్రం కానుండటం వల్ల అంచనాలను అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చిత్రంలోని ప్రతి సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా ఉండేందుకు మరింత శ్రద్ధ పెట్టారని సమాచారం. అందుకు తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్‌ పనులను కూడా దగ్గరుండి చూసుకుంటున్నారట.

SSMB 29 Shooting Update : మూవీ షూటింగ్‌ లోకేషన్స్‌, నటీనటుల ఎంపిక విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అందుకే SSMB 29 అప్‌డేట్స్‌ ఆలస్యమవుతున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా ఈ ఏడాది చివరి కల్లా సినిమాకు సంబంధించిన పనులు ఓ కొలిక్కి వచ్చేలా ప్రయత్నిస్తున్నారట. కొత్త సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తారని సినీ వర్గాల సమాచారం.

కాగా, ఈ చిత్రం అమెజాన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌తో రానుందట. ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. అందుకే ఫారెన్స్ యాక్టర్స్ కూడా నటించనున్నారని తెలిసింది. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఒకరోజు ముందుగానే OTTలోకి 10 సినిమాలు - అందులో 5 తెలుగు చిత్రాలు వెరీ స్పెషల్! - This Week OTT Releases

స్టార్ హీరో లైనప్​లో ఏకంగా 9 సినిమాలు - రూ.650 కోట్ల బడ్జెట్​తో! - Big Budget Upcoming Movies

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.