Mahesh Babu Raayan Review : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ లీడ్ రోల్‌లో తెరక్కెక్కిన 'రాయన్' మూవీ ప్రస్తుతం హిట్ టాక్ అందుకుని దుసుకెళ్తోంది. రిలీజైనప్పటి నుంచి థియేటర్లలో మంచి రెస్పాన్స్‌తో పాటు కలెక్షన్లు అందుకుని సందడి చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాపై ప్రశంసల జల్లును కురిపిస్తూ పలువురు సెలబ్రిటీలు కామెంట్ చేయగా, తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"అద్భుతమైన డైరెక్షన్‌తో పాటు నటనతో ధనుశ్ అదరగొట్టారు. ప్రకాశ్‌రాజ్, ఎస్‌జే సూర్య, సందీప్ కిషన్ లాంటి స్టార్స్ ఎంతో చక్కగా నటించారు. ఇందులో ఉన్న ప్రతిఒక్కరూ 100 శాతం మంచి నటనను కనబరిచారు. మ్యూజికల్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాలో మరో అద్భుతం. 'రాయన్' కచ్చితంగా అందరూ చూడాల్సిన చిత్రం. మూవీ టీమ్‌కి నా శుభాకాంక్షలు" అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వగా, మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఈ సినిమా మేమందరం తప్పక చూస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మహేశ్ పెట్టిన పోస్ట్‌కు 'రాయన్' నటుడు సందీప్ కిషన్ కూడా స్పందించి మహేశ్‌బాబుకు థాంక్స్ చెప్పారు.
#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch…
— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2024
Congratulations to the entire…
మరోవైపు ఈ సినిమాపై వస్తోన్న ప్రశంసలకు హీరో ధనుశ్ ఆనందం వ్యక్తంచేశారు. "మా సినిమాకు ఇంతటి ఘునవిజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు, అలాగే ఆత్మీయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై అమితమైన ప్రేమ చూపించి, అలాగే నాకు ఎల్లవేళలా అండగా నిలబడుతున్న అభిమానులకు థాంక్స్. ఇప్పటివరకూ నేను అందుకున్న బెస్ట్ బ్లాక్‌బస్టర్ బర్త్‌డే గిఫ్ట్ ఇదే" అంటు ధనుశ్ ట్విట్టర్ వేదికగా స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు.
కథేంటంటే : హీరో రాయన్ (ధనుశ్) ఈ సినిమాలో ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడికి ఇద్దరు తమ్ముళ్లు (కాళిదాస్ జయరామ్, సందీప్‌కిషన్), ఒక చెల్లి (దుషారా విజయన్). చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమవుతారు. టౌన్‌కి వెళ్లి వస్తామని చెప్పి మళ్లీ తిరిగిరారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు రాయన్ చేత కత్తి పట్టిస్తాయి. దీంతో రాయన్‌కు అప్పట్నుంచే భయపడకుండా పోరాటం చేయడం అలవాటవుతుంది. తన తోబుట్టువులకు అన్నీ తానై వ్యవహరిస్తాడు.
వారిని వెంటబెట్టుకొని టౌన్‌కు చేరుకుంటాడు. అక్క ఓ మార్కెట్లో పనిచేస్తూ నలుగురూ అక్కడే పెరిగి పెద్దవుతారు. అక్కడ దురై (శరవణన్), సేతు (ఎస్.జె.సూర్య) గ్యాంగ్స్ మధ్య ఎప్పట్నుంచో ఆధిపత్య పోరాటం కొనసాగుతుంటుంది. ఆ గొడవలు రాయన్ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తన తమ్ముళ్లు, చెల్లెలు కోసం రాయన్ ఏం చేశాడు? రాయన్ కోసం వాళ్లు ఏం చేశారు? మిగిలిన విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ధనుశ్ 'రాయన్' రివ్యూ- సినిమా ఎలా ఉందంటే? - Dhanush Raayan Movie Review