Katrina Kaif Glamour Secret : తెలుగులో మల్లీశ్వరి సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్ కెరీర్ ఆరంభంలో అన్నీ విమర్శలే చవి చూశారు. నటన రాదు, ఒక ఎక్స్‌ప్రెషన్ పలకదు, హీరో పక్కన నిలబడి డ్యాన్స్ చేయడం రాదు అంటూ రకరకాలుగా తిరస్కరణలు ఎదుర్కొన్నారు. అలాంటిది బాలీవుడ్‌కి వెళ్లిన ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమ బ్రహ్మారథం పట్టింది. దీంతో అక్కడ ఫుల్ డిమాండబుల్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు దాటుతున్నా అదే గ్లామర్, అదే క్రేజ్ మెయింటైన్ చేస్తున్నారు.
దీనికి ఆమె నటనతో పాటుగా ఫిట్‌నెస్ కూడా ముఖ్య కారణమని చెప్పాలి. ఫిజిక్ మెయింటెనెన్స్ కత్రీనాకు బాగా వర్కౌట్ అయింది. ఈ లండన్ భామ ఇంత ఫిట్‌గా ఉండటానికి ముఖ్య కారణం ప్రముఖ సెలబ్రిటీ డైటీషియన్ శ్వేతా షా అంట. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కత్రిన తీసుకునే డైట్ సీక్రెట్స్ చెప్పేశారు శ్వేతా.
"ఎక్కడ షూటింగ్ ఉన్నా, అందుబాటులో ఉన్న ఆహారం తినేయాలనుకోకుండా ఇంటి భోజనానికే ప్రాధాన్యతనిస్తుంటారు కత్రినా కైఫ్. శరీర అవసరాలకు తగ్గట్టుగా కావాల్సిన పోషకాలను, జ్యూసులను, సప్లిమెంట్స్‌ను సూచిస్తుంటా. దానికి తగ్గట్టుగానే ఆహారం సిద్ధం చేయించుకుంటారు" అని చెప్పారు ప్రముఖ డైటీషియన్ శ్వేతా షా.
కత్రిన అందరిలా మూడు పూటలా తినదట. అందరిలా కాకుండా రోజులో చాలా ఎర్లీగా తినేస్తుందట. ఆ తర్వాత ఇంకొకసారి మాత్రమే తింటుందట. ఇలా రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటుందని శ్వేతా అంటున్నారు. ఇది కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటిదే. భోజనానికీ, భోజనానికీ గంటల కొద్దీ గ్యాప్ ఇవ్వడం వల్ల సులువుగా అరిగిపోతుందని ఆమె వివరించారు. సీజన్‌లో దొరికే కూయగారలు, పండ్లను బట్టి ఆమెకు ఆహారాన్ని సూచిస్తుంటా. పాలు, పాల పదార్థాలు, గ్లూటెన్ ఉండే పదార్థాలు, స్నాక్స్ లాంటివి ఆమె డైట్‌లో అస్సలు ఉండవు.
ఇంకా ఆమె శరీరతత్వాన్ని బట్టి జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవాలి. చలువ చేసే పదార్థాలనే ఆమె ఎక్కువగా తీసుకుంటారు. నల్ల కిస్‌మిస్, మెంతులు, బూడిద గుమ్మడికాయ జ్యూస్, పండ్ల రసాలు వంటి ఆహారంలో కచ్చితంగా ఉండాలి. అప్పుడప్పుడూ ఉసిరి రసం, పుదీనా-కొత్తిమీర రసం కూడా డైట్‌లో ఉండాల్సిందే. ఆమె శరీరతత్వాన్ని బట్టి కండరాల పెరుగుదల కూడా ఎక్కువగా ఉండదు. ఇలాంటి వారిలో జీవక్రియల రేటు ఎక్కువగా ఉండి క్యాలరీలు త్వరగా ఖర్చయిపోతాయి. అందుకే తక్షణ శక్తి అందించడానికి జ్యూస్‌లు లాంటివి సూచిస్తుంటానని శ్వేతా చెబుతున్నారు.
డైట్‌తో పాటు ఆమె శరీరానికి తగ్గట్టుగా వ్యాయామానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి పూటా భోజనం తర్వాత కచ్చితంగా వంద అడుగుల దూరం నడుస్తారు. యోగా, ధ్యానం, స్విమ్మింగ్, బరువులెత్తడం, కార్డియో వ్యాయామాలు ఆమె డైలీ రొటీన్‌లో తొలిసారి.
కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ - నవ్వుతూ బ్యాడ్ న్యూస్ చెప్పిన విక్కీ కౌశల్!
'ఈ సారి కత్రినా కైఫ్ పక్కా ప్రెగ్నెంటే!' - వీడియో వైరల్ - Katrina Kaif Pregnant