ETV Bharat / entertainment

మహేశ్ బాబుతో మూవీ - కార్తి ఏమన్నారంటే? - Karthi Mahesh Babu Movie

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Karthi Mahesh Babu Movie : తన లేటెస్ట్ మూవీ సక్సెస్ ఈవెంట్​లో కోలీవుడ్ హీరో కార్తి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు. అలాగే మహేశ్​ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Karthi Mahesh Babu Movie
Karthi Mahesh Babu Movie (ETV Bharat)

Karthi Mahesh Babu Movie : కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, సీనియర్ నటుడు అరవింద స్వామి లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ మూవీ 'సత్యం సుందరం' బావా, బామ్మర్ది అనుబంధం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీమ్​ ఓ సక్సెస్ ఈవెంట్​ కూడా నిర్వహించింది. అందులో చిత్ర బృందం పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. అయితే మహేశ్​ బాబుపై హీరో కార్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

తాను మహేశ్​ బాబు చిన్న వయసులో ఒకే క్లాస్​లో చదువుకున్నామంటూ కార్తి చెప్పుకొచ్చారు. అవకాశం వస్తే ఆయన (మహేశ్​)తో కలిసి తప్పకుండా నటిస్తానంటూ తెలిపారు. దానికి మంచి కథ కుదరాలని అన్నారు. ఈ మాటలు విని కోలీవుడ్ అలాగే టాలీవుడ్ ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ కాంబోలో ఓ సూపర్ సినిమా రావాలంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

'సత్యం సుందరం' కథేంటంటే ?
సత్యమూర్తి అలియాస్ సత్యం(అరవింద్ స్వామి) గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెంకు చెందిన వ్యక్తి. అతడికి ఆ ఊరు అన్నా అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇళ్లంటే కూడా ఎంతో ఇష్టం. కానీ కొందరు బంధువులు చేసిన మోసంతో సత్యం యుక్తవయసులోనే అతడి కుటుంబం తమ ఇల్లును కోల్పోతుంది. దీంతో వాళ్లు ఆ ఊరుని వదిలేసి వైజాగ్ వెళ్లిపోతాడు. అలా 30ఏళ్లు కూడా గడిచిపోతాయి. అయితే ఇన్నేళ్లు గడిచినా సత్యంకు తన ఊరు, ఇంటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉంటాయి.

ఓసారి తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం సత్యం ఉద్దండరాయుని పాలెం వెళ్లాల్సి వస్తుంది. ఆ పెళ్లిలోనే అతడిని బావా అని ఆప్యాయంగా పలకరిస్తూ ఓ వ్యక్తి (కార్తి) కనపడతాడు. నిజానికి అతడెవరు, తన పేరు ఏంటనేది సత్యంకు తెలీదు. కానీ మొహమాటం కొద్దీ తాను గుర్తుపట్టినట్టుగానే నటిస్తాడు. మొదట్లో అతడి అతి వాగుడు, మితిమీరిన కలుపుగోలుతనం చూసి తనను జిడ్డులా భావించిన సత్యం, కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతడు చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీరిద్దరి ప్రయాణం ఎక్కడి వరకు సాగింది?, ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? అసలు బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో తనుకున్న బంధం ఏంటి? అన్నదే మిగతా కథ.

సత్యం సుందరం ప్రమోషన్​లో 'ఖైదీ 2' అప్డేట్​ - హింట్​ ఇచ్చిన హీరో కార్తి - kaithi 2 Movie Update

హీరో సూర్య చెల్లెలు ఎవరో తెలుసా? మణిరత్నం మూవీ ఛాన్స్​ వచ్చినా నో చెప్పిందట! - Hero Suriya Karthi Sister

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.