ETV Bharat / entertainment

సినిమాకు తగ్గట్లుగానే ప్రచారం - 'కల్కి 2898 AD' ప్రమోషనల్ బడ్జెట్ ఎంతంటే? - Prabhas Kalki 2898 AD - PRABHAS KALKI 2898 AD

Kalki 2898 AD Promotions : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD' మూవీ రిలీజ్​కు కౌంట్​డౌన్​ మొదలైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కూడా ప్రమోషనల్ ఈవెంట్స్​ను ముమ్మరం చేస్తున్నారు. అయితే చిత్రబృందం ఈ ప్రమోషన్స్​ కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టనుందట. ఇంతకీ కల్కి మూవీ ప్రమోషన్స్ బడ్జెట్ ఎంతంటే ?

Kalki 2898 AD Promotions
Kalki 2898 AD Promotions (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 12:01 PM IST

Kalki 2898 AD Promotions : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' మూవీ త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా విడుదలకు మరో నెల మాత్రమే ఉండటం వల్ల మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్​ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలై టీజర్​, క్యారెక్టర్​ రివీల్ వీడియోస్​ సోషల్ మీడియాలో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంతే కాకుండా తాజాగా రిలీజైన బుజ్జి క్యారెక్టర్ వీడియో కూడా అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. పైగా ప్రభాస్ లుక్​ అండ్ క్యారెక్టరైజేషన్ వల్ల ఈ మూవీపై ఓ రేంజ్​లో అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ప్రమోషన్స్​కు ఈ మూవీ టీమ్​ భారీ స్థాయిలో ఖర్చు పెట్టే ప్లాన్​లో ఉందట. మూవీ బడ్జెట్​లో 10 శాతం దీనికే ఖర్చు చేయనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ మూవీ బడ్జెట్​ దాదాపు రూ. 600 కోట్లు కాగా, అందులో 10 శాతం అంటే దాదాపు రూ. 60 కోట్లు ఖర్చు చేయనున్నారట. ఇటీవల ఐపీఎల్​లో పాపులరైన 12 సెకన్ల యాడ్​ కోసం మూవీ దాదాపు రూ. 3 కోట్లు ఖర్చు చేసిందట. చూస్తుంటే ఈ ప్రమోషనల్ బడ్జెట్ కూడా త్వరలోనే టాక్​ ఆఫ్​ ద టౌన్​గా మారనుందని సినీ వర్గాల మాట.​

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే, ఇది భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇందులో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన సరసన దిశా పటానీ హీరోయిన్​గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు బిగ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది.

హమ్మయ్య భైరవుడి బుజ్జి ఎవరో తెలిసిపోయిందోచ్​ - ఆసక్తి రేకెత్తిస్తోన్న వీడియో - Kalki 2898 AD Movie

'కల్కి' మేకర్స్ ప్రమోషనల్​ స్ట్రాటజీ - ఈ సినిమాకు అక్కడ కూడా సూపర్ క్రేజ్! - PRABHAS KALKI 2898 AD Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.