ETV Bharat / entertainment

తొలిసారి కూతురిని చూపించిన రామ్​చరణ్- పాప ఫేస్​లో ఇది గమనించారా? - Ramcharan Upasana Daughter - RAMCHARAN UPASANA DAUGHTER

Ramcharan Daughter Photo : రామ్​ చరణ్ కూతురు క్లీంకార ఫేస్​ను రివీల్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. పాప ముఖం చూస్తున్న వారు ఒకటి గమనించారు. అదేంటంటే?

తొలిసారి కూతురిని చూపించిన రామ్​చరణ్  - పాప ముఖంలో ఇది గమనించారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 1:41 PM IST

Updated : Mar 27, 2024, 4:21 PM IST

Ramcharan Daughter Photo: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు గతేడాది పాప జన్మించిన సంగతి తెలిసిందే. పాపకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే క్లీంకార జన్మించి 9 నెలలు అయినా పాప ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే నేడు ( మార్చి 27న) రామ్ చరణ్ 37వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రామ్ చరణ్ దంపతులు తమ ముద్దుల కూతురు క్లింకారను కూడా తీసుకువెళ్లారు.

క్లింకార పుట్టి దాదాపు 10 నెలలు అవుతున్నా మీడియాకు తనని ఒక్కసారి కూడా చూపించలేదు ఈ జంట. కానీ ఈరోజు ఉపాసన చేతిలో ఉన్న క్లింకార ముఖం కెమెరా వైపు ఉండటం వల్ల ఆ చిన్నారి ముఖం కెమెరాకు చిక్కింది. పట్టు పంచెలో రామ్ చరణ్ సంప్రదాయ వస్త్ర ధారణలో ఉపాసన శ్రీవారిని దర్శించుకున్నారు. అభిమానులు వాళ్ళిద్దరిని చూసి క్యూ లైన్ లోనే రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు.

ఉపాసన చేతిలో ఉన్న క్లింకార కొంచెం కనిపించగానే చరణ్ ఉపాసన ను ముందుకు వెళ్ళమని సైగ చేశారు. దర్శనం తర్వాత భద్రతా సిబ్బంది సహాయంతో కార్లో కూర్చున్నారు ఈ మెగా దంపతులు. అంతే ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో క్లింకార కళ్ల గురించి చర్చ నడుస్తోంది. అభిమానులు ఆ కళ్లు అచ్చం రామ్​చరణ్​విలా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

గత ఏడాది జూన్ 20న క్లింకార పుట్టినప్పటి నుండి మెగా కుటుంబం తనని చూపించకుండా తన ఫోటోల మీద ఏమోజీలని పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ తమ గారాల పట్టి కనపడకుండా జాగ్రతపడేవారు. ఎటువంటి సోషల్ ఈవెంట్స్ కు వచ్చినా క్లీంకారను ముఖం తన వైపు వచ్చేలా ఎత్తుకుని కనిపించేవారు. అయితే తండ్రి పుట్టినరోజు సందర్భంగా క్లింకార మీడియాకు కనిపించడం పట్ల మెగా అభిమానులు సంబర పడుతున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో షూటింగ్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో RC16 సినిమా లైన్లో ఉంది. ఆ తర్వాత హోళీ పండగ రోజు పోస్టర్ విడుదలైన RC17 సినిమా సుకుమార్ దర్శకత్వంలో రానుంది.

ముంబయిలో చెర్రీ ఫ్యామిలీ- క్లీంకారకు కరీన బిగ్ హెల్ప్!- బాలీవుడ్ ఎంట్రీ ఫిక్సా?

Chiranjeevi Birthday : ''చిరు'తాత.. హ్యాపీ బర్త్​డే'.. క్లీంకార​ స్పెషల్​ విషెస్​.. క్యూట్​ ఫొటో చూశారా?

Last Updated : Mar 27, 2024, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.