ETV Bharat / entertainment

'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ - చెన్నైలో క్రేజీ ఎపిసోడ్స్ - Ram Charan Game Changer - RAM CHARAN GAME CHANGER

Game Changer Shooting : లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్​ను ప్రారంభించారు 'గేమ్ ఛేంజర్ మేకర్స్'. త్వరలో మరో కీలక షెడ్యూల్​ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఆ విశేషాలు మీ కోసం.

Game Changer Shooting
Game Changer Shooting
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 11:45 AM IST

Game Changer Shooting : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్​లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. శంకర్ ఒకేసారి రెండు ప్రాజెక్టుల పనుల్లో బిజీగా ఉండటం వల్ల 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మరింత ఆలస్యమవుతోంది. అయితే తన కుమార్తె పెళ్లి కారణంగా కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్న శంకర్, ఇప్పుడు మళ్లీ షూటింగ్​ను ప్రారంభించారట. ఇందులో భాగంగా చెన్నైలో కీలక షెడ్యూల్​ను ప్లాన్ చేస్తున్నారట.

తాజాగా హైదరాబాద్‌లో పలు కీలక సీన్స్​ను చిత్రీకరించారట. అందులో నవీన్ చంద్ర, సునీల్, రామ్ చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారట. దీని తర్వాత తదుపరి షూట్ మే 1 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఇప్పటికే రామ్ చరణ్ కలెక్టర్ పాత్రలో మంత్రుల ప్రమాణ స్వీకారానికి సెక్యూరిటీ ఆర్గనైజ్ చేసే సీన్‌ను చిత్రీకరించారు. దీనికి కొనసాగింపుగా శంషాబాద్ ఏరియాలో మిగతా భాగాన్ని పూర్తి చేశారట. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉండే ఓ పెద్ద బంగ్లాలో ఈ షూట్ తీశారట. తదుపరి షూటింగ్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అవుతుందని సమాచారం.

పొలిటికల్​ యాక్షన్​ థీమ్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇందులో రామ్​చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, ఈ సినిమాలో నటి అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.ప్రముఖ నిర్మాత దిల్​రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై శిరీష్​తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా రూపొందిస్తున్నారు.

ఇటీవలే చెర్రీ బర్త్​డే స్పెషల్​గా ఈ చిత్రం నుంచి జరగండి అనే సాంగ్​ను విడుదల చేేేశారు. నేచురల్ లుక్ కోసం ప్రత్యేకంగా ఈ సెట్ వేశారు. దీనికి కోసం మేకర్స్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాక్​గ్రౌండ్ సెట్స్, విజువల్ వర్క్స్​ అదిరిపోయాయి. రియల్ లొకేషన్​లోనే సాంగ్ షూట్ చేసినట్లు అనిపిస్తుంది.

ముఖ్యంగా రామ్​చరణ్- కియారా లుక్స్​, స్క్రీన్ ప్రెజెన్స్ సాంగ్​కు హైలైట్​గా నిలిచాయి. మరోవైపు 'గేమ్ ఛేంజర్' నార్త్ థియేటర్ రైట్స్ రూ. 75 కోట్లకు అమ్ముడుపోయిందట. గ్లోబల్ స్టార్​కు నార్త్​లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా అక్కడ ఆ రేంజ్​లో క్లిక్ అయ్యింది. అంతే కాకుండా ఈ స్టోరీ లైన్ కూడా చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోందని సమాచారం.

రామ్​చరణ్ బర్త్ డే స్పెషల్- 'జరగండి' సాంగ్ వచ్చేసిందోచ్​- చెర్రీ, కియారా స్టెప్పులు చూశారా? - Game Changer Jaragandi Song

అనుకున్నట్లే అంతా- ఆ డైరెక్టర్​తో చెర్రీ నెక్స్ట్ మూవీ- హోలీ స్పెషల్ బాసూ! - RC 17 Announcement

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.