Flops Movies 100 Days In Theatre: ఇప్పుడైతే ఒక మూవీ ఒక రెండు, మూడు వారాలు థియేటర్లో ఉండడమే గొప్ప. ఒకప్పుడు 100 రోజులు ఆడిందంటే ఆ సినిమా సూపర్ హిట్ అని అర్థం. అయితే 100 రోజులు ఆడిన సూపర్ హిట్ చిత్రాలే కాదు 100 రోజులు ఆడిన ప్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ మూవీ లిస్ట్ లో మహేష్ బాబు సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ మూవీ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.
- మున్నా(2007): అప్పటివరకు చేసిన మూవీస్ లో మాస్ లుక్ లో కనిపించిన ప్రభాస్. ఈ చిత్రంలో స్టూడెంట్ గా తన కారెక్టర్ కు తగ్గట్టు క్లాస్ లుక్ లో కనిపించాడు. తన అందంతో అప్పటి యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఇలియానా కూడా ప్రభాస్ సరిజోడి అనిపించుకుంది. ఇందులో పాటలు కూడా ఇప్పటికీ క్లాసిక్ సాంగ్స్ గా చలామణి అవుతున్నాయి. ఎటొచ్చి మూవీ కంటెంట్ అప్పటి ఆడియెన్స్ కు పెద్దగా రుచించలేదు. ఫలితం ఈ చిత్రం ప్రభాస్ రేంజ్ హిట్ అందుకోలేదు. అయితేనేం దాదాపు 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ మూవీ. ప్లాప్ టాక్ తెచ్చుకున్నా 9 థియేటర్లో వంద రోజులు ఆడటం విశేషమే.
- స్పైడర్(2017): మహేష్ బాబు, మురుగదాస్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన స్పైడర్ అంచనాలను తలక్రిందులు చేసి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ మూవీ ప్లాప్ అయినా ఇందులో నెగటివ్ రోల్ పోషించిన ఎస్ జె సూర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. సంగీతం కూడా ఆశించినంత హిట్ కాలేదు. అయినా సరే నెల్లూరు రామరాజు థియేటర్లో 100 రోజులు ఆడింది స్పైడర్.
- అంజి(2004): సరిగ్గా 20 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కింది. అమ్మోరు లాంటి విజువల్ వండర్ తీసిన కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 30 కోట్ల భారీ బడ్జెట్ తో శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించారు. భారీ బడ్జెట్, టాప్ హీరో, గ్రాఫిక్స్ మాయాజాలం ఏది ఈ సినిమాని కాపాడలేకపోయాయి. ప్లాప్ అయినా సరే మెగాస్టార్ స్టార్ డం ఈ చిత్రాన్ని కొన్ని సెంటర్లలో వంద రోజులు ఆడేలా చేసింది.
- ఖలేజా(2010): మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలైనా ఆడియెన్స్ కు మహేష్ బాబు కామెడీ రుచించలేదు. అయితే ఇదే మూవీకి టీవీలో మాత్రం టిఆర్పీ రేటింగ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కూడా చిత్తూరులో శ్రీనివాస థియేటర్లో వంద రోజులు ఆడింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గెట్ రెడీ ఫ్యాన్స్ - 'సలార్-2' షూటింగ్ మొదలయ్యేది అప్పుడే! - Salaar 2 Shooting