ETV Bharat / entertainment

'దేవర' ప్రమోషన్స్​లో జాన్వీ అందం - చీర, ఇయర్ రింగ్స్ ధర రూ.14 లక్షలు! - Devara Promotions Janhvi Kapoor - DEVARA PROMOTIONS JANHVI KAPOOR

Devara Promotions Janhvi Kapoor Saree : దేవర ప్రమోషన్స్​లో జాన్వీ క‌పూర్ చీర‌కట్టులో కనిపించి సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ధరించిన చీర, ఇయర్ రింగ్స్​ ధర నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

source Associated Press
Devara Promotions Janhvi Kapoor Saree (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 1:57 PM IST

Devara Promotions Janhvi Kapoor Saree : యంగ్ టైగర్ ఎన్టీఆర్​,​ అతిలోక సుంద‌రి జాన్వీ కపూర్ కలిసి న‌టించిన లేటెస్ట్ మూవీ 'దేవ‌ర'. తాజాగా ట్రైలర్​ రిలీజ్ అవ్వడంతో దేవరపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీటీమ్ కూడా జోరుగా ప్రమోషన్స్​ చేస్తోంది. ఎన్టీఆర్​, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కూడా మూవీ ప్రమోషన్స్​లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అయితే ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఈవెంట్ కోసం జాన్వీ క‌పూర్ చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్, పింక్ కలర్​ శారీలో మెరిసిపోయింది. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అదిరే పోజులు ఇచ్చింది.

దీంతో ఆ పిక్స్ తెగ వైరల్ అయ్యాయి. అది చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అదే సమయంలో ఆమె ధరించిన గులాబీ రంగు చీర, ఇయర్​ రింగ్స్​ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాయి. దీంతో వాటి ధర ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ చీర ఖ‌రీదు అక్ష‌రాల రూ. 1,24,850 అని పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఆ చీరకు పెయిర్ అప్​గా చెవుల‌కు జాన్వీ పెట్టుకున్న ఇయ‌ర్ రింగ్స్ ధ‌ర రూ. 13 ల‌క్ష‌లు అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విష‌యం తెలుసుకుంటున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

కాగా, తెలుగులో జాన్వీ క‌పూర్​కు దేవ‌ర‌నే మొదటి చిత్రం. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. యువ‌సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని దర్శకుడు కొర‌టాల శివ తెరకెక్కించారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో చిత్రాన్ని రూపొందించారట. సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. తొలి భాగాన్ని సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్​గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్​లో టికెట్ల ప్రీ సేల్స్​ రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. విడుదలైన పాటలు కూడా సోషల్ మీడియా యూట్యూబ్​లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి.

చీరకట్టులో అందంగా ముస్తాబైన 'దేవర' జాన్వీ - ఈ పిక్స్​ చూస్తే దిమాక్‌ ఖరాబ్‌! - Devara Janhvi Kapoor Saree Pics

'దేవర' బిజినెస్ డీటెయిల్స్ ఇవే​ - భారీ స్థాయిలో టికెట్ ప్రీ సేల్స్​! - NTR Devara Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.